LPG Gas Cylinder : బండ‌బ‌డ గ్యాస్ గుదిబండ

ధ‌రా భారం మోయ‌లేం

LPG Gas Cylinder  : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం ధ‌రా భారం మోపుతూనే ఉన్న‌ది. దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా

ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ వ‌చ్చిన స‌ర్కార్ ఇప్పుడు ఫ‌లితాలు వెలువ‌డ‌డంతో చ‌మురు, గ్యాస్ (Gas) కంపెనీలు ధ‌ర‌ల‌ను (LPG Gas Cylinder )పెంచుతూ మోత మోగిస్తున్నాయి.

మోదీ (Modi) మాత్రం మౌనం వీడ‌డం లేదు. గ‌త ప‌ది రోజుల నుంచి ధ‌ర‌ల ద‌రువు మోపుతోంది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో ల‌బోదిబోమంటున్నారు వినియ‌గ‌దారులు. అటు వాహ‌న‌దారుల‌తో పాటు సామాన్యులు నానా తంటాలు ప‌డుతున్నారు.

నిన్న‌టి దాకా ఆయిల్ కంపెనీలు వాత పెడితే త‌గుదున‌మ్మా అంటూ గ్యాస్ (Gas) కంపెనలు ధ‌ర‌లు అమాంతం పెంచాయి.

తాజాగా క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను(LPG Gas Cylinder )ఆయిల్, గ్యాస్ (Gas) మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచాయి.

ఇదిలా ఉండ‌గా డొమెస్టిక్ (గృహ వినియోగం ) సిలిండ‌ర్ల (Cylinder) ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు రాక పోవ‌డం విశేషం. పండ‌గ త‌ర్వాత దానిపై కూడా ధ‌ర భారం పెంచే ఉంది. ఏకంగా రూ. 250 పెంచాయి.

19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండర్ (Cylinder) పై ఏకంగా పెంచ‌డాన్ని తీవ్రంగా మండి ప‌డుతున్నాయి. ఈనెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్ సిలండ‌ర్ల‌పై ధ‌ర‌ల పెంపు లేక పోవ‌డంతో వినియోగ‌దారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీలో పెంచిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ. 2, 253 ఉండ‌గా , కోల్ క‌తా లో రూ. 2, 351 , ముంబైలో రూ. 2, 205 , చెన్నై లో రూ. 2,406, హైద‌రాబాద్ లో రూ. 2, 460 గా ఉన్నాయి.

గ్యాస్ ధ‌ర‌లు పెంచడంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది దేశ వ్యాప్తంగా.

Also Read : ఎంపీల సేవ‌లు ప్ర‌శంస‌నీయం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!