SRH vs LSG IPl 2022 : హైద‌రాబాద్ రాణించేనా ల‌క్నో గెలిచేనా

ఇరు జ‌ట్ల‌కు లీగ్ మ్యాచ్ అత్యంత కీల‌కం

SRH vs LSG  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ఇవాళ న‌వీ ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కెప్టెన్ ను మార్చినా జ‌ట్టు త‌లరాత మాత్రం మార‌డం లేదు.

కేన్ విలియ‌మ్స‌న్ కు సార‌ధ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH vs LSG )యాజ‌మాన్యం. ఎప్ప‌టి లాగే ప‌రాజ‌యంతో హైద‌రాబాద్ ప్రారంభించింది.

ఇక కొత్త‌గా జాయిన్ అయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుని జోరు మీదుంది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం.

ప్ర‌ధానంగా స‌న్ రైజ‌ర్స్ కు. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి. తుది జ‌ట్ల‌ను ఆట ప్రారంభం కంటే ముందు ప్ర‌క‌టిస్తారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ , అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కేన్ విలిమ్స‌న్ కెప్టెన్ . ఇక జ‌ట్టులో స‌న్ అబాట్ , ర‌వికుమార్ స‌మ‌ర్ద్ , సౌర‌భ్ దూబే,

ఎయిడెన్ మార్క‌ర‌మ్, గ్లెన్ ఫిలిప్స్ , నికోల‌స్ పూర‌న్, అబ్దుల్ సమ‌ద్, అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ , జ‌గ‌దీశ సుచిత్, పియం గార్గ్,

ఫ‌జ‌ల్హ‌క్ ఫారూఖీ, రొమారియో షెప‌ర్డ్, టి. న‌ట‌రాజ‌న్ , శ‌శాంక్ సింగ్ , మార్కో జాన్సెన్ , విష్ణు వినోద్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి, శ్రేయ‌స్ గోపాల్ , ఉమ్రాన్ మాలిక్ ఆడ‌తారు.

Also Read : బట్ల‌ర్ స్ట‌న్నింగ్ క్యాచ్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!