David Warner : పంత్ లా ఆ షాట్ ఆడాల‌ని ఉంది

ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్

David Warner  : ప్ర‌పంచంలోనే టాప్ ప్లేయ‌ర్ల‌లో ఒక‌డు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner ). మ‌నోడు ఒక్క‌సారి కుదురుకున్నాడంటే ఇక షాట్స్ ఆడుతూనే ఉంటాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వార్న‌ర్ ను అనూహ్యంగా వ‌దులుకుంది.

విచిత్రం ఏమిటంటే త‌న సార‌థ్యంలోనే ఆ జ‌ట్టుకు ఐపీఎల్ టైటిల్ వ‌చ్చేలా చేశాడు. కానీ టీం మేనేజ్ మెంట్ మాత్రం అనూహ్యంగా అత‌డిని ప‌క్క‌న పెట్టింది. ఘోరంగా అవ‌మానానికి గురి చేసింది.

కానీ పోయిన చోటే వెతుక్కోవాల‌న్న సామెను గుర్తు చేసుకుంటూ మ‌ళ్లీ జూలు విద‌ల్చ‌డం ప్రారంభించాడు. ఏకంగా దుబాయి వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఏకంగా ఆస్ట్రేలియా క‌ప్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

అంతేనా స్వ‌దేశంలో ఇంగ్లండ్ తో జ‌రిగిన సీరీస్ లో కూడా స‌త్తా చాటాడు. ఇక గ‌త ఫిబ్ర‌వ‌రి నెల 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో అన్ని జ‌ట్లు వార్న‌ర్ ను ప‌క్క‌న పెడితే ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాత్రం అత‌డిని చేజిక్కించుకుంది.

దీంతో నిన్న‌టి దాకా పాకిస్తాన్ టూర్ లో ఉన్న డేవిడ్ వార్న‌ర్(David Warner )ముంబైలో వాలి పోయాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాడు. తన‌కు రిష‌బ్ పంత్ లా ఆడాల‌ని ఉంద‌న్నాడు.

రిష‌బ్ ఒంటి చేత్తో షాట్స్ కొట్ట‌డంలో దిట్ట‌. త‌న‌కు అలా ఆడాల‌ని ఉంద‌ని త‌న‌లోని కోరిక‌ను బ‌య‌ట పెట్టాడు. కాగా ఇవాళ ఐపీఎల్ లో భాగంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Also Read : అలా ఆడతాన‌ని అనుకోలేదు

Leave A Reply

Your Email Id will not be published!