Mahesh Babu : బాలీవుడ్ ఎంట్రీపై ప్రిన్స్ కామెంట్

ఇప్ప‌ట్లో వెళ్లాల‌ని లేద‌న్న మ‌హేష్ బాబు

Mahesh Babu  : సౌత్ ఇండియాలో టాప్ హీరోగా పేరొందిన ప్రిన్స్ మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ కు చెందిన ఈ స్టార్ కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉండ‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌భాస్, అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండ‌గా మ‌హేష్ బాబు(Mahesh Babu )మాత్రం ఆస‌క్తి చూప‌న‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తారా అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌ట్లో త‌న‌కు ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు మ‌హేష్ బాబు.

ప్రిన్స్ ఇటీవ‌ల ఒక ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. తాను హిందీ మూవీస్ చేయాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. తాను తెలుగు సినిమాపై ఫోక‌స్ పెడుతూ వ‌చ్చాన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ భాష అన్న‌ది చూడ‌డం లేద‌ని ఏదైనా చూస్తార‌ని పేర్కొన్నారు. సినిమాలో ద‌మ్ము అనేది ఉంటే ఎక్క‌డైనా ఆడుతుంద‌న్నారు మ‌హేష్ బాబు(Mahesh Babu ).

ఇక్క‌డ త‌న ప్లేస్ కు ఢోకా లేదు. ఈ స‌మ‌యంలో అక్క‌డికి వెళ్లి న‌టించ‌డం అన్న‌ది బాగోద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు ప్రిన్స్. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా సౌత్ స్టార్స్ బాలీవుడ్ సినిమాల‌పై క‌న్నేస్తుండ‌గా మ‌హేష్ బాబు మాత్రం తెలుగు సినిమాకే ప‌రిమ‌తం అవుతూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన స‌ర్కారు వారి పాట రిలీజ్ కావాల్సి ఉంది.

ఆయ‌న దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళితో సంత‌కం చేశారు.

Also Read : 1000 కోట్ల వైపు ఆర్ఆర్ఆర్ ప‌రుగు

Leave A Reply

Your Email Id will not be published!