Rahul Tewatia : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు

తెవాటియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

Rahul Tewatia :  ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ అసాధార‌ణ విజ‌యం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

190 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్ కు. స్టార్టింగ్ లో శుభ్ మ‌న్ గిల్ స‌త్తా చాటాడు. 59 బంతులు ఎదుర్కొన్న గిల్ 11 ఫోర్లు ఒక సిక్స్ తో 96 ప‌రుగులు చేశారు.

ఆ త‌ర్వాత అద్భుతం చోటు చేసుకుంది. 20 ఓవ‌ర్ల‌లో 19 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. 4 బంతులు పూర్త‌య్యాయి 7 ప‌రుగులు మాత్ర‌మే చేసింది గుజ‌రాత్ టైటాన్స్ . ఇక 2 బంతులు 12 ప‌రుగులు చేయాలి.

ఈ స‌మ‌యంలో ఉత్కంఠ‌కు తెర దించుతూ క్రీజులో ఉన్న రాహుల్ తెవాటియా బిగ్ షాక్ ఇచ్చాడు. ఆ రెండు బాల్స్ ను సిక్స్ లు కొట్టాడు. దీంతో అసాధ్య‌మ‌నుకున్న విజ‌యాన్ని సుసాధ్యం చేశాడు రాహుల్ తెవాటియా(Rahul Tewatia).

దీంతో తెవాటియాపై తాజా, మాజీ క్రికెట్ దిగ్గ‌జాలు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఓడియ‌న్ స్మిత్ కు చుక్క‌లు చూపించాడు. అద్భుతంగా ఆడావంటూ కితాబు ఇచ్చారు మాజీ క్రికెట‌ర్లు వీరేంద్ర సెహ్వాగ్ , యువ‌రాజ్ సింగ్ , ఇర్ఫాన్ ప‌ఠాన్ , ఆకాశ్ చోప్రా, మ‌హ్మ‌ద్ కైఫ్ , కృనాల్ పాండ్యా.

సామాజిక మాధ్య‌మాల‌లో వారు త‌మ అభినంద‌న‌లు తెలిపారు. గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుటై వెళ్లాక వ‌చ్చిన రాహుల్ తెవాటియా పంజాబ్ కు చుక్క‌లు చూపించాడు. విజ‌యం అందించాడు. ప్ర‌స్తుతం తెవాటియా హాట్ టాపిక్ గా మారాడు.

Also Read : హైద‌రాబాద్ గెలిచేనా చెన్నై బోణీ కొట్టేనా

Leave A Reply

Your Email Id will not be published!