Ricky Ponting Shah : పృథ్వీ షా టాలెంట్ అద్భుతం

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోచ్ రికీ పాంటింగ్

Ricky Ponting Shah : ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ , ఆసిస్ మాజీ క్రికెట్ దిగ్గ‌జం రికీ పాంటింగ్(Ricky Ponting Shah) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. త‌మ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పృథ్వీ షాపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌న్నాడు.

ఐపీఎల్ లో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడ‌ని, అవ‌స‌ర‌మైన మేర‌కు ప‌రుగులు చేస్తున్నాడ‌ని తెలిపాడు. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్ల‌లో షా ఒక‌డ‌ని పేర్కొన్నాడు.

డేవిడ్ వార్న‌ర్ జ‌ట్టులో చేర‌డం అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింద‌ని పేర్కొన్నాడు. అయితే జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇప్పుడు మంచి జోడీ కుదిరింద‌ని తెలిపాడు.

ఓ వైపు వార్న‌ర్ అనుభ‌వం, ఇంకో వైపు పృథ్వీ షా మెరుపుద‌నం క‌లిసి జ‌ట్టుకు మంచి స్కోర్ ల‌భిస్తోంద‌ని చెప్పాడు రికీ పాంటింగ్(Ricky Ponting Shah). ఇద్ద‌రూ ఆట‌ను ఆస్వాదిస్తున్నార‌ని వీలైన‌న్ని ప‌రుగులు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలిపాడు.

వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఇలాగే కంటిన్యూ అయితే త‌మ జ‌ట్టుకు ఢోకా ఉండ‌ద‌న్నాడు. తాము కూడా టైటిల్ రేసులో ఉండ‌డం ఖాయ‌మ‌న్నాడు రికీ పాంటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ పోడ్ కాస్ట్ లో రికీ పాంటింగ్ త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.

ఆట‌పై మ‌రింత ఫోక‌స్ పెడితే షా కు తిరుగంటూ ఉండ‌ద‌న్నాడు హెడ్ కోచ్. నెట్ సెష‌న్స్ లో వేరుగా ఉంటుంది. కానీ మ్యాచ్ ప‌రంగా చూస్తే మైదానంలోకి దిగాకే తెలుస్తుంద‌న్నాడు.

తాను ముంబై ఇండియ‌న్స్ కోచ్ గా ఉన్న స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ చాలా చిన్న వాడు. పాండ్యా ఆడ‌లేదు. కుర్రాళ్లు ఇప్పుడు స‌త్తా చాటుతున్నారంటూ కితాబు ఇచ్చాడు రికీ పాంటింగ్.

Also Read : ఉతికి ఆరేసిన రాబిన్ ఉత‌ప్ప

Leave A Reply

Your Email Id will not be published!