Munawar Faruqui : మునావ‌ర్ ఫ‌రూఖీ భావోద్వేగం

కంట‌త‌డి పెట్టిన కంగ‌నా ర‌నౌత్

Munawar Faruqui : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ హోస్ట్ గా లాక్ అప్ అనే రియాల్టీ షో కొన‌సాగుతోంది. ఈ షో మోస్ట్ పాపుల‌ర్. త‌మ త‌మ అనుభ‌వాల‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పాల్సి ఉంటుంది పార్టిసిపెంట్స్ .

ఇక దేశంలో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ గా పేరొందారు మునావ‌ర్ ఫ‌రూఖీ(Munawar Faruqui). షో సంద‌ర్భంగా ఫ‌రూఖీ త‌నకు క‌ష్టం క‌లిగించిన అంశాన్ని పంచుకున్నాడు. త‌న జీవితంలో క‌లిగిన న‌ష్టం గురించి పంచుకున్నాడు.

లాప్ అప్ ఆదివారం జ‌డ్జిమెంట్ డే ఎపి సోడ్ అత్యంత ఆస‌క్తిక‌రంగా సాగింది. హోస్ట్ కంగ‌నా ర‌నౌత్ సూచ‌న‌ల మేర‌కు హాస్య న‌టుడు త్వ‌ర‌గా త‌న ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్ట‌మ‌ని కోరింది.

అప్పుడు మునావ‌ర్ ఫ‌రూఖీ త‌న క‌థ‌ను పంచుకున్నాడు. అది నా జీవితంలో మ‌రిచి పోలేని రోజు. 2007 జ‌న‌వ‌రి. ఎప్పుడో ఉద‌యం 7 గంట‌ల‌కు మా అమ్మ‌మ్మ న‌న్ను నిద్ర లేపింది.

మా అమ్మ‌కు ఏదో జ‌రిగింద‌ని చెప్పింది. ఆమెను ఆస్ప‌త్రికి తీసుకు వెళ్లాం. అక్క‌డికి వెళ్లే స‌రిక‌ల్లా మా అమ్మ‌ను ఎమ‌ర్జెన్సీ వార్డు నుంచి బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తున్నారు.

ఆమె అరుస్తోంది. నేను ఆమె చేయి ప‌ట్టుకున్నాను. ఒక క్ష‌ణం ఉంది. వైద్యులు త‌మ‌లో తాము మాట్లాడుకుంటున్నారు. వాళ్లు అమ్మ చేయిని విడిచి పెట్ట‌మ‌ని చెప్పారు.

నేను ఇప్ప‌టికీ దానిని వ‌ద‌లేన‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు మునావ‌ర్ ఫ‌రూఖీ. అత‌ను మాట్లాడుతుండ‌గానే స‌హ కంటెస్టెంట్లు క‌ర‌ణ్ వీర్ బోహ్రా, అంజ‌లీ అరోరా , జీష‌న్ ఖాన్ భావోద్వేగానికి లోన‌య్యారు. కంగ‌నా ర‌నౌత్ కూడా కంట త‌డి పెట్టింది.

Also Read : పూజా ఫ్లాప్‌ల‌తో బెంబేలెత్తుతున్న ఆచార్య‌

Leave A Reply

Your Email Id will not be published!