Jos Butler : బ‌ట్ల‌ర్ సెన్సేష‌న్ మార‌థాన్ ఇన్నింగ్స్

జోస్ దెబ్బ‌కు ఠారెత్తిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్

Jos Butler : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జోస్ బ‌ట్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రు అన్న‌ది చూడ‌డం లేదు.

అటాకింగ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. అద్భుత‌మైన షాట్స్ తో అల‌రిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ కు అమిత‌మైన ఆనందాన్ని క‌లిగిస్తున్నాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో మ‌రోసారి సెంచరీతో మెరిశాడు.

ఇది జోస్ బ‌ట్ల‌ర్ కు రెండో సెంచ‌రీ కావ‌డం విశేషం. బ‌ట్ల‌ర్(Jos Butler) కు తోడు కెప్టెన్ సంజూ శాంస‌న్ తోడు కావ‌డంతో రాజ‌స్థాన్ భారీ స్కోరు సాధించింది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 217 ప‌రుగులు చేసింది.

జాస్ బ‌ట్ల‌ర్ 61 బంతులు ఎదుర్కొన్నాడు . ఇందులో 9 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్స‌ర్ల‌తోనే 75 ప‌రుగులు వచ్చాయి. శాంస‌న్ 38 ర‌న్స్ చేస్తే హిట్ మైర్ 13 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 26 ర‌న్స్ చేశాడు.

ఇక బ‌ట్ల‌ర్ విష‌యానికి వ‌స్తే అత‌డి పూర్తి పేరు జోసెఫ్ చార్లెస్ బ‌ట్ల‌ర్(Jos Butler). 8 సెప్టెంబ‌ర్ 1990లో ఇంగ్లండ్ లో పుట్టాడు. ప్ర‌స్తుతం ఆ దేశ క్రికెట్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బ్యాట‌ర్ ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ పేరు పొందాడు. వైట్ బాల్ ను ఆడ‌డంలో దిట్ట‌. ఒక్క‌సారి మైదానంలోకి వ‌చ్చాడంటే ఇక త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే ప్ర‌త్య‌ర్థి జట్లు ఎంత త్వ‌ర‌గా పంపిస్తే అంత బెట‌ర్ అనుకుంటారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఐపీఎల్ 2022లో ఇంకెన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తాడో వేచి చూడాలి. ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త ఆట‌గాళ్ల స్కోర్ లో టాప్ లో ఉన్నాడు జోస్ బ‌ట్ల‌ర్.

Also Read : రోడ్డు ప్ర‌మాదంలో టెన్నిస్ ప్లేయ‌ర్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!