LSG vs RCB IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరుకు రెడీ అయ్యింది.
రాత్రికి ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ లో ఇరు జట్లు సరిసమానంగా ఉన్నాయి.
బలాబలాలలో దుమ్ము రేపేందుకు రెడీగా ఉన్నాయి. కాక పోతే 15వ సీజన్ లో పాయింట్ల పట్టికలో చూస్తే ఇరు జట్లు 8 పాయింట్లతో సేమ్ ఉన్నాయి.
మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ(LSG vs RCB IPL 2022) టాప్ లో ఉంది.
ఇప్పటికే గత మ్యాచ్ లలో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పై గెలుపొందింది.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం నమోదు చేసింది.
ఇక లక్నో పరంగా చూస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో టాప్ స్కోరర్లలో రాహుల్ కంటిన్యూగా తన చోటు సంపాదించుకున్నాడు.
ఇక ఆర్సీబీలో దినేశ్ కార్తీక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరిపై ఆయా జట్లు ఎక్కువగా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. జట్ల పరంగా చూస్తే లక్నో నుంచి రాహుల్, డికాక్ , పాడే, స్టోయినిస్ , హుడా, పాండ్యా, బదోని, జేసన్ , టై, రవి, ఖాన్ ఉన్నారు.
ఇక ఆర్సీబీ నుంచి డుప్లెసిస్ , రావత్ , కోహ్లీ, మ్యాక్స్ వెల్ , ప్రభు, షాబాజ్ , దినేశ్ , హసరంగా, హర్షల్ , హేజిల్ వుడ్, సిరాజ ఆడతారు.
Also Read : తిప్పేసిన అశ్విన్ రస్సెల్ పరేషాన్