Aishwarya Rai Abhishek : బాలీవుడ్ సినీ దిగ్గజం బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ప్రముఖ నటి ఐశర్య రాయ్ (Aishwarya Rai Abhishek)పెళ్లి జరిగి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఇద్దరూ నటులుగా పేరొందారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు.
పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం తక్కువ చేసింది ఐశ్వర్య. అంతకు ముందు ఆమెను పిచ్చిగా ప్రేమించాడు సల్మాన్ ఖాన్. కానీ అతడి ప్రేమను, శాడిజాన్ని తట్టుకోలేక పోయింది ఐశ్వర్య.
కోట్లాది ఆస్తులు కలిగి ఉన్న ఐశ్వర్య ఎట్టకేలకు అభిషేక్ బచ్చన్ తో తన బంధాన్ని కంటిన్యూ చేసింది. వీరిద్దరి జంటకు ఓ పాప కూడా ఉంది. తామిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోను అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్(Aishwarya Rai Abhishek) షేర చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి 20 ఏప్రిల్ 2007లో ముంబైలో వివాహం చేసుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని త్రో బాక్ ఫోటోను పంచుకున్నారు.
అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ కు ఉంగరాన్ని తొడిగే సన్నివేశానికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు. ఇదిలా ఉండగా అభిషేక్ క్యాప్షన్ ను ఖాళీగా ఉంచితే ఐశ్వర్య రాయ్ ఎమోజీ శ్రేణితో ఫోటోను పంచుకుంది.
ప్రముఖ నటులు స్పందించారు. ఇలాగే సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని సొనాలీ బెంద్రే కోరారు. కాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీసిన గురు సినమా సెట్స్ లో అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పెడ్డారు.
పెళ్లి చేసుకున్నారు. అనంతరం బిగ్ బి ఒప్పుకోవడంతో ప్రేమ పెళ్లిగా మారింది.
Also Read : కేజీఎఫ్-2 కలెక్షన్ల జాతర కంటిన్యూ