Kartik Tyagi : సురేష్ రైనా నా పాలిట దేవుడు – త్యాగి

హైద‌రాబాద్ యంగ్ పేస‌ర్ కామెంట్

Kartik Tyagi : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యంగ్ స్టార్ పేస‌ర్ కార్తీక్ త్యాగి (Kartik Tyagi) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కు గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన సురేష్ రైనా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

రైనా త‌న జీవితంలో దేవుడిలా ప్ర‌వేశించాడ‌ని కితాబు ఇచ్చాడు. తాను ఈ స్థాయిలో ఉన్నాన‌నంటే ఆయ‌నే కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. యువ‌కుడిగా ఉన్న త‌న‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించాడ‌ని తెలిపాడు.

ప్ర‌స్తుతం కార్తీక్ త్యాగి ఎస్ ఆర్ హెచ్ త‌ర‌పున ఐపీఎల్ 2022లో ఆడుతున్నాడు. 2020 అండ‌ర్ -19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో త్యాగి పాలు పంచుకున్నాడు. అద్భుతంగా రాణించాడు.

త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఐపీఎల్ లో 2020లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని ఎంచుకుంది. తొలి సీజ‌న్ లో 9 వికెట్లు తీసుకున్నాడు.

ఈ ఏడాది 2022 ఫిబ్ర‌వ‌రి 12, 13 ల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం పాట‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మేనేజ్ మెంట్ సిఇఓ కావ్య మార‌న్ ఏకంగా కార్తీక్ త్యాగిని(Kartik Tyagi) రూ. 4 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

త‌న‌ను ప్రోత్స‌హిస్తూ వెన్నుత‌ట్టిన సురేష్ రైనాను తాను మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు కార్తీక్ త్యాగి. నేను రంజీలో ఆడ‌డం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి నేటి దాకా న‌న్ను గుర్తించి, స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాడ‌ని కితాబు ఇచ్చాడు.

నా బౌలింగ్ తీరును గ‌మ‌నించి రైనా నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. నీకు భ‌విష్యత్తు ఉంద‌న్నాడు. తాను కూడా రెఫ‌ర్ చేస్తాన‌ని తెలిపాడు కార్తీక్ త్యాగి.

Also Read : పొలార్డ్ నిర్ణ‌యం ఆట‌గాళ్ల విస్మ‌యం

Leave A Reply

Your Email Id will not be published!