Yash : దీపిక‌తో న‌టించాల‌ని ఉంది – రాఖీ భాయ్

మ‌నసులో మాట బ‌య‌ట పెట్టిన స్టార్

Yash :ఒకే ఒక్క సినిమాతో భార‌తీయ సినీ రంగాన్ని షేక్ చేసిన ఒకే ఒక్క‌డు. పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ గా పేరొందిన క‌న్న‌డ హీరో య‌శ్ (Yash)అలియాస్ రాఖీ భాయ్ సంచల‌న కామెంట్స్ చేశారు.

ప్ర‌స్తుతం అత‌డితో న‌టించాల‌ని ఎంతో మంది హీరోయిన్లు క‌ల‌లు కంటున్నారు. అత‌డంటే వేలాది మంది అమ్మాయిలు ప‌డి చ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ న‌టించిన మూవీ కేజీఎఫ్ బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. తాజాగా ఇదే సినిమాను సీక్వెల్ గా కేజీఎఫ్‌- 2గా తెరకెక్కించాడు ద‌ర్శ‌కుడు.

ఈ ఒక్క సినిమా కోలీవుడ్, శాండిల్ వుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ ఇలా భార‌త్ తో పాటు ఓవ‌ర్సీస్ లో దుమ్ము రేపింది. 6 రోజుల్లో రూ. 645 కోట్లు కొల్ల‌కొట్టింది. అంతే కాదు రూ. 1000 కోట్ల‌ను దాటుకునే ప‌నిలో ప‌డింది ఈ మూవీ.

తాజాగా ఇప్పుడు ఈ చిత్రం గురించిన చ‌ర్చే జ‌రుగుతోంది. య‌శ్ న‌ట‌న‌తో పాటు ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించిన సంజ‌య్ ద‌త్, ర‌వీనా ఠాండ‌న్ , శ్రీ‌నిధి న‌ట‌న సినిమాకు హైలెట్ గా నిలిచింది.

హాలీవుడ్ ను సైతం ఆశ్చ‌ర్య పోయేలా తీశాడంటూ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ను ప్ర‌శంసిస్తున్నారు. ఈ త‌రుణంలో య‌శ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనేతో స్క్రీన్ షేర్ చేసు కోవాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు.

దీంతో ఇప్పుడు రాఖీ భాయ్ చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీపిక న‌ట‌న బాగుంటుంద‌ని ఆమె సినిమాలు తాను చూస్తాన‌ని చెప్పాడు య‌శ్.

Also Read : ఆదికి స‌క్సెస్ అందించే ప‌నిలో ల‌వ్లీ రైట‌ర్‌

Leave A Reply

Your Email Id will not be published!