Jos Butler : చుక్క‌లు చూపించిన జోస్ బ‌ట్ల‌ర్

ఐపీఎల్ 2022లో వ‌రుస‌గా మూడో సెంచ‌రీ

Jos Butler  : ఈసారి ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స‌రికొత్త‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటోంది. గ‌త ఐపీఎల్ లో ఆశించినంత మేర రాణించ లేక పోయింది.

కానీ ఈ 15వ సీజ‌న్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతూ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తోంది.

ప్ర‌ధానంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ , ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగిన హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (Jos Butler )ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నాడు.

ఎంత మంచి స్టార్ బౌల‌ర్లైనా అత‌డి ముందు త‌ల‌వంచ‌క త‌ప్ప‌డం లేదు. అటు పేస్ , ఇటు స్పిన్ ఏ ర‌కంగా బంతుల్ని వేసినా జోస్ బ‌ట్ల‌ర్ (Jos Butler )ను నిలువ‌రించ లేక పోతున్నాయి.

తాజాగా ముంబై వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో జోస్ బ‌ట్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా మ‌రోసారి చెల‌రేగి పోయాడు. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు.

కేవ‌లం 65 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న జోస్ 116 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 9 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ మెగా లీగ్ లో బ‌ట్ల‌ర్ కు ఇది వ‌రుస‌గా మూడో సెంచ‌రీ. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ఇది ఓ రికార్డుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతే కాదు మొద‌టి వికెట్ కు 155 ప‌రుగుల భాగ‌స్వామ్యం చేయ‌డం కూడా చ‌రిత్రే. ఏది ఏమైనా ఇప్పుడు బ‌ట్ల‌ర్ ఉన్నాడంటే ఆశ వ‌దులు కోవాల్సిన ప‌రిస్థితి ఇతర జ‌ట్ల‌కు ఉంది.

 Also Read : ధోనీ..ఓం ఫినిష్యాయ‌ న‌మః

Leave A Reply

Your Email Id will not be published!