Samantha : సమంత సంచ‌ల‌నం వెచ్చ‌ని జ్ఞాప‌కం

మాయ చేసేసి మ‌న‌సు దోచేసి

Samantha  : సినీ వాలిలో క‌దిలే న‌వోన్మిక స‌మంత‌. న‌టిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. ఇవాళ ఈ విల‌క్ష‌ణ న‌టి పుట్టిన రోజు. స‌మంత రుత్ ప్ర‌భుకు 34 ఏళ్లు. 28 ఏప్రిల్ 1987లో. 2017లో అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌తో పెళ్లి చేసుకుంది.

2021 దాకా క‌లిసే ఉన్నారు. ఆ త‌ర్వాత విడి పోయారు. ఎందుకు విడిపోయారు అన్న దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

తెలుగు, త‌మిళ్ , హిందీ భాష‌ల్లో న‌టించింది. సినిమాల‌తో పాటు వెబ్ సీరీస్ లో కూడా న‌టించి మెప్పించింది.

ఇటీవ‌ల క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ పుష్ప‌లో దుమ్ము రేపింది. స్పెష‌ల్ సాంగ్ తో ఆక‌ట్టుకుంది.

ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అన్న పాట‌ను చంద్ర‌బోస్ రాస్తే మంగ్లీ సిస్ట‌ర్ పాడంది.

దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప్ర‌స్తుతం ముంబైలో ఉంటోంది స‌మంత‌.

ఇటు హైద‌రాబాద్ లో సైతం వ‌స్తూ పోతోంది. న‌టి స‌మంత(Samantha )బ‌ర్త్ డే కావ‌డంతో సినీ ప్ర‌ముఖులు ఆమెకు విషెష్ చెబుతున్నారు.

విభిన్న‌మైన పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించాల‌ని ఇలాగే ఆక‌ట్టు కోవాల‌ని కోరుతున్నారు ఫ్యాన్స్ . ఇక స‌మంత కెరీర్ తొలినాళ్ల‌లో మోడ‌లింగ్ చేసింది.

2007లో ర‌వి వ‌ర్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్కోవిన కావేరీ మూవీలో న‌టించేందుకు ఒప్పుకుంది. కానీ త‌న తొలి చిత్రం మాత్రం గౌతం వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏం మాయ చేశావే మూవీనే అంటుంది ఇప్ప‌టికీ స‌మంత‌.

2010లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత బృందావ‌నం, దూకుడు, ఈగ‌, ఎటో వెళ్లి పోయింది మ‌న‌సు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు , అత్తారింటికి దారేది, పుష్ప‌లో న‌టించి టాప్ హీరోయిన్ గా నిలిచింది.

త‌మిళ సినిమాల్లో కూడా పాపుల‌ర్ అయ్యింది. అంజాన్ , క‌త్తి సినిమాల‌తో ఆద‌ర‌ణ పొందింది. 2013లో రేవతి మూవీ ద్వారా ఫిలిం ఫేర్ అవార్డు పొందింది. హిందీ వెబ్ సీరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజ‌న్లో రాజీ పాత్ర‌ను పోషించింది.

Also Read : అజ‌య్ దేవ‌గ‌న్ బీజేపీ మౌత్ పీస్

Leave A Reply

Your Email Id will not be published!