Vijay Devarakonda : వెండి తెర మీద నటనతోనే కాదు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన నటిగా పేరొందారు సమంత రుత్ ప్రభు. ఆమె 2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. 2021 దాకా సాగింది. ఆ తర్వాత అనుకోకుండా తామిద్దరం విడి పోతున్నట్లు ప్రకటించారు.
అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అనంతరం సమంత ఊహించని రీతిలో బీజీగా మారి పోయారు. కొంత సమయం గ్యాప్ ఇచ్చినా ఆ తర్వాత పుంజుకున్నారు. వరుస సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తూ తనను తాను నటిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీలో ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మావా అన్న సాంగ్ కు నటి సమంత చేసిన డ్యాన్స్ కుర్రకారునే కాదు వయసు మళ్లిన వారిని సైతం మెస్మరైజ్ చేసింది.
దేశాన్ని ఒక ఊపు ఊపింది. రికార్డుల మోత మోగించింది. అందులో సమంత పలికించిన హావభావాలు షేక్ చేశాయి. తాజాగా సమంత తన 35వ బర్త్ డేను జరుపుకుంది ఈనెల 28న.
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ , శాండిల్ వుడ్ ఇలా తెలిసిన ప్రతి ఒక్కరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా రౌడీ బాయ్ గా పేరొందిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఊహించని రీతిలో బర్త్ డే విషెష్ తెలిపారు సమంతకు.
దీంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని పేర్కొంది. ఇదే సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం రానుంది.
Also Read : అజయ్ దేవగన్ బీజేపీ మౌత్ పీస్