Sanju Samson : సంజూ శాంస‌న్ ఇలాగేనా ఆడేది

కీల‌క స‌మ‌యంలో చెత్త షాట్స్ అవ‌స‌ర‌మా

Sanju Samson : కేర‌ళ స్టార్ హిట్ట‌ర్. మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ గా పేరొందిన సంజూ శాంస‌న్(Sanju Samson) ప్ర‌స్తుతం ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ‌త సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన వ్య‌క్తిగ‌త బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్నాడు.

కానీ ఈసారి ఆశించినంత మేర రాణించ‌లేక పోతున్నాడు. ఇదే ఇప్పుడు మేనేజ్ మెంట్ ను క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. నాయ‌కుడిగా కొద్దిగా ప‌ర్వాలేద‌ని అనిపించినా విప‌త్క‌ర స‌మ‌యంలో, జ‌ట్టు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు చెత్త షాట్స్ ఆడుతూ వికెట్ ను పారేసుకుంటున్నాడు.

హ‌స‌రంగ బౌలింగ్ లో రివ‌ర్స్ షాట్ ఆడ‌బోయి ఈజీగా వికెట్ ను స‌మ‌ర్పించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్ లు ఆడింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఇందులో 6 గెలిచింది మూడు ఓడి పోయింది.

ఓ వైపు గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొత్త జ‌ట్లు దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి.

ఓ వైపు బ్యాటింగ్ లో ఇంకో వైపు బౌలింగ్ లో బాగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ రాజ‌స్థాన్ కు ప్ర‌ధాన అడ్డంకిగా ఇప్పుడు సంజూ శాంస‌న్ మార‌డం బాధాక‌రం.

ఇక‌నైనా త‌న ఆట తీరును మార్చు కోవాలి. ఎక్కువ స‌మ‌యం క్రీజులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ప‌రుగులు ధారాళంగా చేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది.

లేదంటే త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను మార్చుకుంటే స‌రి పోతుంది. ఇక‌నైనా అన‌వ‌స‌ర షాట్స్ కు పోకుండా ఆట‌పై ఫోక‌స్ పెడితే బెట‌ర్.

Also Read : ధ‌వ‌ల్ రాణించేనా ముంబై రాత మారేనా

Leave A Reply

Your Email Id will not be published!