Anushka Sharma : ఫామ్ లోకి వ‌చ్చిన కోహ్లీ అనుష్క హ్యాపీ

53 బంతులు 58 ప‌రుగులు చేసిన విరాట్

Anushka Sharma : ఐపీఎల్ 2022లో త‌న పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ వ‌చ్చాడు దిగ్గ‌జ క్రికెట‌ర్ , స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ.

ఈ సీజ‌న్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోహ్లీ ఈసారి ఆ జ‌ట్టు నాయ‌క‌త్వం నుంచి త‌ప్పుకున్నాడు.

విచిత్రం ఏమిటంటే త‌ను హాఫ్ సెంచ‌రీ చేసేందుకు 9 మ్యాచ్ లు తీసుకున్నాడు. ఇందులో రెండు గోల్డెన్ డ‌కౌట్లు ఉన్నాయి. త‌న కెరీర్ లో గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి విరాట్ కోహ్లీ స‌హ‌జ సిద్ద‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

ఒక్కోసారి ఇత‌డు కోహ్లీనేనా అన్న అనుమానం వ‌చ్చేలా ఆడాడు. ఈ త‌రుణంలో లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ తో కోహ్లీ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్నాడు.

58 ర‌న్స్ చేశాడు. తిరిగి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉన్నాయి. దీంతో స్టేడియం లాన్స్ లో కూర్చుని తెగ ఎంజాయ్ చేసింది విరాట్ కోహ్లీ ల‌వ్లీ వైఫ్ అనుష్క శ‌ర్మ‌(Anushka Sharma).

ఈ సంద‌ర్భంగా హాఫ్ సెంచ‌రీ సాధించాక త‌న బ్యాట్ ను త‌న భార్య‌కు చూపించాడు గ‌ర్వంగా కోహ్లీ. అత‌డిని ఉత్సాహ ప‌రుస్తూ వ‌చ్చింది అనుష్క శ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఈ వీడియో, ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ప్ర‌పంచంలో అత్యంత న‌మ్మ‌క‌మైన‌, ప్ర‌ముఖ‌మైన బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌లో విరాట్ కోహ్లీ ఒక‌డు. అత‌డి బ్రాండ్ వాల్యూ చెక్కు చెద‌ర లేదు.

Also Read : స‌మ ఉజ్జీల పోరులో విజేత ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!