Arun Lal Marriage : భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రంజీ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఉన్న అరుణ్ లాల్(Arun Lal Marriage ) పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న ఆయన గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలైన బుల్బుల్ సాహాను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వృత్తి రీత్యా టీచర్ అయిన బుల్ బుల్ సాహాను కోల్ కతా లోని ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఈ మాజీ క్రికెటర్ వయసు 66 ఏళ్లు.
ఆయన రెండో పెళ్లి చేసుకోవడం చర్చకు దారి తీసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన మొదటి భార్య రీనాతో ఆయన విడి పోయారు. అయితే అనారోగ్యం దృష్ట్యా ఆమెతో నివసిస్తున్నారు అరుణ్ లాల్.
సాహాను వివాహం చేసుకునేందుకు అరుణ్ లాల్ తన మొదటి భార్య తో పర్మిషన్ పొందాడు. సాహాతో పాటు తన మొదటి భార్యను కూడా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
కాగా అరుణ్ లాల్ కంటే బుల్ బుల్ సాహా 28 ఏళ్లు చిన్నది. కోల్ కతా లోని ఓ పాఠశాలలో బోధించే సాహా ఈనెల 2న తామిద్దరు పెళ్లి చేసుకున్న ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు.
ప్రస్తుతం ఆమె , అరుణ్ లాల్ ఫోటోలు వైరల్ గా మారాయి. వివాహానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఒక్కటైన జంట సంతకం చేసినట్లు కొన్ని ఫోటోలు కూడా పంచుకున్నారు.
Also Read : క్రికెట్ సంకుచిత స్వభావానికి నిదర్శనం