Graeme Swann : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు. గ్రేమ్ స్వాన్ (Graeme Swann)తో పాటు రవిశాస్త్రి.
టోర్నీ ప్రారంభం కంటే ముందే తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో సీఎస్కే కెప్టెన్ గా ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠకు తెర దించుతూ సీఎస్కే యాజమాన్యం ఉన్నట్టుండి జిడ్డూ అలియాస్ రవీంద్ర జడేజాకు అప్పగించింది.
దీని వెనుక ధోనీ ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ జడేజా కెప్టెన్సీ తీసుకున్నాక పూర్తిగా నిరాశకు గురి చేసింది ఆ జట్టు. వరుసగా ఓడి పోవడం మొదలు పెట్టింది. ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి.
దీంతో ఉన్నట్టుండి సీఎస్కే మరోసారి జడేజాను తప్పించి ధోనీకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ జట్టులో ఏం జరుగుతుందనేది తెలియకుండా పోయింది.
ఈ తరుణంలో మేనేజ్ మెంట్ కావాలని తప్పుకునేలా చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటికి రెస్పాండ్ అయ్యాడు రవీంద్ర జడేజా. ఈ తరుణంలో తాను నాయకత్వ బాధ్యతలు మోయలేనంటూ అందుకే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. జడేజా రిజైన్ చేయడాన్ని స్వాగతించాడు గ్రేమ్ స్వాన్(Graeme Swann). సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసించాడు.
ఇక నుంచి బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గ్రేమ్ స్వాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి.
Also Read : శివమెత్తిన రోవ్ మన్ పావెల్