Sukumar : స‌ర్కార్ వారి పాట హిట్ కావ‌డం ప‌క్కా

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్

Sukumar : టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సుకుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా ప‌రుశురామ్ తీసిన స‌ర్కార్ వారి పాట హిట్ కావ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు.

సుకుమార్(Sukumar) ఇప్ప‌టికే మ‌హేష్ బాబుతో సినిమా తీశారు. ఇక తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా ప్రీ రిలీజ్ వేడుక చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కులు మ‌లినేని గోపీ చంద్, బుచ్చి బాబు, మెహ‌ర్ ర‌మేష్ , వంశీ పైడిప‌ల్లి హాజ‌ర‌య్యారు.

 

త‌మకు ప్రిన్స్ మ‌హేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాను సెట్ లో ఉన్న‌ప్పుడు అమ్మాయిలే అందంగా ఉండే వార‌ని అనుకునే వాడిన‌ని కానీ మ‌హేష్ బాబును చూశాక అది త‌ప‌ప‌ని తెలుసుకున్నాన‌ని కితాబు ఇచ్చాడు.

ఇక సుకుమార్ మ‌హేష్ బాబును ఆకాశానికి ఎత్తేశాడు. మ‌హేష్ బాబు డైరెక్ట‌ర్స్ ఛాయిస్ అని పేర్కొన్నాడు. ఇక ఇటీవ‌లే విడుద‌ల చేసిన స‌ర్కార్ వారి పాట మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపేలా ఉంద‌న్నాడు.

మ‌హేష్ ను క‌మ‌ర్షియ‌ల్ గా ప‌వ‌ర్ ఫుల్ గా తీశాడ‌ని ప్ర‌శంసించారు ద‌ర్శ‌కుడిని. మ మ మ‌హేష పాట‌ను చూశా. అలాంటి పాట‌ను నా చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ట్రైల‌ర్ చూశాక సినిమాను ఎప్పుడు వ‌స్తుందా అన్న క్యూరియాసిటీ నాలో మొద‌లైంద‌ని చెప్పారు సుకుమార్(Sukumar). ప‌రుశురామ్ డైలాగ్స్ అంటే నాకు ఇష్టం అని తెలిపాడు.

 

Also Read : మ‌హేష్ బాబు కోస‌మే క‌థ రాసుకున్నా

Leave A Reply

Your Email Id will not be published!