Priyanka Chopra : ప్రియాంక చోప్రా కూతురి ఫోటో వైరల్
హాస్పిటల్ లో 100 రోజులు గడిపాక పోస్ట్
Priyanka Chopra : మదర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన చిన్నారి ఫోటోను షేర్ చేసింది సోషల్ మీడియా వేదికగా. ప్రస్తుతం ఆమె ఫోటో వైరల్ గా మారింది.
ఆస్పత్రిలో 100 రోజులు గడిపింది. కూతురు పుట్టడం తనకు ఎంతో ఆనందం కలిగించిందంటూ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra), నిక్ జోనాస్ తమ కూతురును సరోగసీ ద్వారా స్వాగతించారు.
ప్రియాంక చోప్రా పాపతో ఉన్న మొదటి చిత్రాన్ని పంచుకుంది. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ తొలి ఫోటో పోస్ట్ చేసిన వెంటనే వేలాదిగా లైక్స్ వచ్చాయి.
ఆమె తన గాయకుడు, గేయ రచయిత బర్త నిక్ జోనాస్ తో కలిసి నవజాత శిశువును పట్టుకుని ఉంది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 100 ప్లస్ డేస్ గడిపారు.
ఈ సందర్బంగా చిన్న అమ్మాయి ఎట్టకేలకు ఇంటికి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ మేరకు క్యాప్షన్ కూడా జత చేశాడు. ప్రతి కుటుంబం ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. ఒక నిర్దిష్టమైన విశ్వాసం, నమ్మకంతో ఏర్పడి ఉంది.
ఈ క్షణాలు ఎంతో విలువైనవి. ప్రతి ఓణం పరి పూర్ణంగా ఉంటుందని వెల్లడించింది ప్రియాంక చోప్రా తను చేసిన పోస్ట్ లో. తనను, తనతో పాటు కూతురిని బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్యులు, సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), నిక్ జోనాస్.
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కొన్ని నెలల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేశారు. డిసెంబర్ 2018లో పెళ్లి చేసుకున్నారు.
Also Read : సినిమా చూశాక కళావతిగా గుర్తిస్తారు