Ritika Nayak : ఎవ‌రీ రితికా నాయ‌క్ ఏమిటా క‌థ

సినీ కెరీర్ ను మార్చేసిన ఒక్క ఛాన్స్

Ritika Nayak : ఒకే ఒక్క సినిమా రితికా నాయ‌క్ ను మార్చేసింది. త‌న సినీ కెరీర్ లో మ‌రికొన్ని సినిమాల‌లో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. అశోక వ‌నంలో అర్జుణ క‌ళ్యాణం మూవీలో న‌టించింది. త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఆమె న‌ట‌కు 100 మార్కులు ప‌డ్డాయి. దీంతో ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల క‌న్ను రితికా నాయ‌క్ పై ప‌డింది. రితికా నాయ‌క్(Ritika Nayak) న‌టిగానే కాదు మోడ‌ల్ కూడా. ఢిల్లీ ఆమె స్వ‌స్థ‌లం. 2019లో త‌న కాలేజీ రోజుల్లో మోడ‌లింగ్ తో త‌న కెరీర్ ను స్టార్ట్ చేసింది.

ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజ‌న్ 12 , మిస్ దివా 2020 టైటిళ్ల‌ను గెలుచుకుంది. 2021లో రితికా నాయ‌క్(Ritika Nayak) తెలుగు సినిమా రంగంలోకి ఎంట‌రైంది. న‌టిగా త‌న జీవితాన్ని ప్రారంభించింది.

అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం ఆమెకు తొలి చిత్రం. 1997లో పుట్టిన రితికా వ‌య‌సు ఇప్పుడు 25 ఏళ్లు. ప్ర‌యాణించ‌డం అంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మొద‌టి సినిమాతోనే రితికా నాయ‌క్ కు మంచి మార్కులు ప‌డ్డాయి. గ‌తంలో హ్యాపీ డేస్ మూవీలో న‌టించిన త‌మ‌న్నా భాటియాకు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే రితికా నాయ‌క్(Ritika Nayak) కు కూడా అలాంటి చాన్స్ లు రావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఆమె ల‌క్ ఏమిటంటే టాలీవుడ్ ను శాసిస్తున్న అల్లు అర‌వింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ఏకంగా రితికా నాయ‌క్ తో మూడు సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు టాక్.

అంతే కాకుండా పెద్ద మొత్తంలో రెమ్యునరేష‌న్ కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం ఒకే ఒక్క చిత్రం ఆమె జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ప్ర‌ధానంగా స‌క్సెస్ ఫుల్ సంస్థ‌లో చాన్స్ కొట్టేయ‌డం అంటే మ‌రింత స‌క్సెస్ అందుకునేందుకు మార్గం ఏర్ప‌డిన‌ట్లే.

 

Also Read : ఎఫ్-3 ప‌క్కా న‌వ్వుల న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!