CSK vs MI IPL 2022 : హమ్మ‌య్య ముంబై గెలిచింది

5 వికెట్ల తేడాతో చెన్నై ఓట‌మి

CSK vs MI IPL 2022 : ఐపీఎల్ 2022లో లీగ్ మ్యాచ్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ల మ‌ధ్య జ‌రిగిన గేమ్ లో ఎట్ట‌కేల‌కు మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది ముంబై ఇండియ‌న్స్(CSK vs MI). ఈ రెండు జ‌ట్లు ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరుకోలేక పోయాయి.

పేల‌వ‌మైన ఆట‌తీరు, నాయ‌క‌త్వ లోపం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ఇప్ప‌టికే ఐపీఎల్ టైటిల్ ను 5 సార్లు నెగ్గిన ముంబై , నాలుగు సార్లు చేజిక్కించుకున్న సీఎస్కే ఈసారి మాత్రం నిరాశ‌కు గురి చేశాయి.

ప్ర‌స్తుతం కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. మిగ‌తా రెండు జ‌ట్లు ఏవి అనే దానిపై స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 97 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇక త‌క్కువ స్కోర్ ను ఛేదించే క్ర‌మంలో ముంబై కూడా త‌డబ‌డింది. ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది(CSK vs MI).

5 వికెట్లు కోల్పోయి 98 ప‌రుగులు చేసి గెలుపొందింది. మ‌రోసారి తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద్భుతంగా రాణించాడు. 34 ప‌రుగులు చేసి కీల‌క పాత్ర పోషించాడు.

ఇక సీఎస్కే బౌల‌ర్ల‌లో ముఖేష్ చౌద‌రి మూడు, స‌మ‌ర్ జిత్ , మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు. ఇక ముంబై బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే సామ్స్ మూడు వికెట్లు తీస్తే మెరిడిత్ 2, బుమ్రా, కార్తికేయ‌, ర‌మ‌ణ్ దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.

ఇరు జ‌ట్లకు గెలిచినా ఓడి పోయినా ఎలాంటి ఫ‌ర‌క్ ప‌డ‌దు.

 

Also Read : యూఏఈ టీ20 లీగ్ లో బాద్ షా ఎంట్రీ

Leave A Reply

Your Email Id will not be published!