Brendon McCullum : ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కోచ్ గా మెక్ క‌ల్ల‌మ్

ప్ర‌క‌టించిన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు

Brendon McCullum : ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు స‌మావేశ‌మైన బోర్డు టెస్టు జ‌ట్టు కోచ్ గా మాజీ కెప్టెన్ బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్(Brendon McCullum) ను నియ‌మించిన‌ట్లు తెలిపింది. అధికారికంగా ప్ర‌క‌టించింది.

ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఇంగ్లండ్ జ‌ట్టు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టూర్ల‌లో సీరీస్ కోల్పోయింది. ప్రపంచంలోనే అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరొందిన ఆ జ‌ట్టు కెప్టెన్ జో రూట్ ఉన్న‌ట్టుండి కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు.

ఒక ర‌కంగా జ‌ట్టు ఓడి పోవ‌డానికి ఆటగాళ్లంతా బాధ్యులే. కానీ జో రూట్ ఈ వ‌రుస ఓట‌ముల‌కు తన‌దే బాధ్య‌త అంటూ ప్ర‌క‌టించాడు. ఇక ఉండ‌లేనంటూ స్ప‌ష్టం చేశాడు. దీంతో ఈసీబీ మ‌రో స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన బెన్ స్టోక్స్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇప్ప‌టికే ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న సిల్వ‌ర్ వుడ్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ త‌ప్పుకున్నాడు. ఇక ఆనాటి నుంచి ఎవ‌రు కోచ్ గా ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

చివ‌ర‌కు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం క్రికెట్ ప‌రంగా అపార‌మైన అనుభ‌వం క‌లిగిన బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్(Brendon McCullum) వైపు మొగ్గు చూపింది. అత‌డినే చివ‌ర‌కు ఖ‌రారు చేసింది.

కాగా వ‌చ్చే జూన్ నెల‌లో కేన్ విలియ‌మ్స‌న్ నాయ‌క‌త్వంలోని న్యూజిలాండ్ జ‌ట్టు 3 మ్యాచ్ ల టెస్టు సీరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ కు రానుంది.

ఈ సీరీస్ నుంచే బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్ కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ కు కోచ్ గా ఉన్నాడు.

 

Also Read : హమ్మ‌య్య ముంబై గెలిచింది

Leave A Reply

Your Email Id will not be published!