Pooja Hegde : విజయ్ తో న‌టించ‌నున్న బుట్ట‌బొమ్మ‌

రౌడీతో పూజా హెగ్డే రొమాన్స్

Pooja Hegde : అన‌తి కాలంలోనే పాపుల‌ర్ హీరోయిన్ గా పేరొందిన బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde) కు సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. టాలీవుడ్ లో ల‌వ‌ర్ బాయ్ , రౌడీగా పేరు తెచ్చుకున్న తెలుగు వాడైన విజ‌య్ దేవ‌ర‌కొండ తో న‌టించ‌నున్న‌ట్లు టాక్.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రి గురించి టాలీవుడ్ లో వైర‌ల్ అవుతోంది వార్త‌. తాజాగా విజ‌య్ డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ లో న‌టిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది.

ఇందులో మైక్ టైస‌న్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ మూవీ ఇంకా విడుద‌ల కావాల్సి ఉంది. ఇదే స‌మ‌యంలో రెండో ప్రాజెక్టు జ‌న‌గ‌ణ‌మ‌న పేరుతో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించేందుకు రెడీ అయ్యాడు.

చార్మీ, వంశీ పైడిప‌ల్లి, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా దీనిని రూపొందించ‌నున్నారు. ఇదే సినిమాలో మొద‌ట హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ను అనుకున్నారట‌.

కానీ ఆమె డేట్స్ కుద‌ర‌క పోవ‌డంతో తాజాగా ముద్దుగుమ్మ పూజా హెగ్డేను(Pooja Hegde) సంప్ర‌దించ‌డం, ఆమె ఓకే కూడా చెప్పేసింద‌ని స‌మాచారం. దీంతో రౌడీ ఫ్యాన్స్ కు ఇటు బుట్ట‌బొమ్మ అభిమానుల‌కు పండ‌గేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ అనే స‌రిక‌ల్లా సినిమా ఓ రేంజ్ లో ఉండ‌డం మామూలే. అంతే కాదు ఆయ‌న సినిమాల పేర్ల‌న్నీ డిఫ‌రెంట్ గా ఉంటాయి.

అంతే కాదు హీరోయిన్ ను మ‌రింత క్రేజీగా తీయ‌డంలో పూరికి సాటి రారు ఎవ‌రూ. పూరీ ఆర్జీవీ టీం స‌భ్యుడు. అందుకే స్క్రిప్టే కాదు పాత్ర‌లు భిన్నంగా ఉంటాయి. స‌మాజాన్ని ప్ర‌శ్నించేలా హీరో డామినేష‌న్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు.

 

Also Read : మ‌హేష్ అన్న‌దాంట్లో త‌ప్పేముంది

Leave A Reply

Your Email Id will not be published!