Actor Vijay & KCR : దళపతి కేసీఆర్ ను కలిసిన తలపతి
విజయ్ ను సన్మానించిన ముఖ్యమంత్రి
Actor Vijay & KCR : తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోలివుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పేరొందా ఇలయ తలపతి విజయ్. ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును కలుసుకున్నారు.
సాయంత్రం ప్రగతి భవన్ లో వీరిద్దరూ భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది. పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ హీరో విజయ్(Actor Vijay & KCR) కు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తలపతి విజయ్ ను శాలువాతో సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున జ్ఞాపికను అందజేశారు కేసీఆర్. ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు.
కాగా ఇది మర్యాద పూర్వకమైన భేటీగానే పేర్కొంటున్నా దాని వెనుక రాజకీయ పరమైన చర్చలు కూడా వచ్చినట్లు సమాచారం. ఆయన హైదరాబాద్ కు ఎందుకు వచ్చారనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఇటీవల తలపతి విజయ్ స్థాపించిన పార్టీ తమిళనాడులో ఇటీవల జరిగిన పుర, పట్టణ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందారు. దీంతో విజయ్ తన అభిమానులను దృష్టిలో ఉంచుకుని రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీపై బహిరంగంగానే వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం కలిగించింది.
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అంతర్గతంగా ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ కు మద్దతు పలికినట్లు ప్రచారం జరిగింది.
సైకిల్ గుర్తు కావడంతో విజయ్ సైకిల్ పై వెళ్లి ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇవాళ కేసీఆర్ తో కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : ఫ్యాన్స్ కు..టీంకు థ్యాంక్స్ – ప్రిన్స్