Pawan Kalyan Chai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ సింబ‌ల్ టీ గ్లాసు

సామాన్యుల‌కు కొండ గుర్తు చాయ్

Pawan Kalyan Chai : తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ పాపుల‌ర్ హీరో కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. న‌టుడు, భావుకుడు, రాజ‌కీయ నాయ‌కుడు. సాహితీ పిపాస‌కుడు. ప్ర‌కృతి ప్రేమికుడు. ప‌వ‌ర్ స్టార్ సినిమాలలో న‌టిస్తారు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా సాహిత్యాన్ని చ‌దువుతారు.

ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా పుస్త‌కాలు వెంట‌నే ఉంటాయి. నిత్యం చ‌దువుతూ, మంచి మాట‌ల్ని , ప‌దాల‌ను పుస్త‌కంలో నోట్ చేసుకుంటారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాటిని గుర్తు చేస్తారు.

ఆయ‌న‌కు గుంటూరు శేషేంద్ర శ‌ర్మ , ఆలూరి బైరాగి , ర‌వీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన క‌విత్వం అంటే చ‌చ్చేంత ఇష్టం. అందుకే తాను స్థాపించిన రాజ‌కీయ పార్టీకి గుర్తుగా కోట్లాది మంది నిత్యం వాడే, ఇష్ట‌ప‌డే టీ గ్లాసును పెట్టుకున్నారు.

పేద‌ల‌కు ఇది ఆలంబ‌న‌గా, ధైర్యంగా ఉంటుంది. దానిని తాను ఎంచుకున్నాన‌ని ఓ సంద‌ర్భంలో చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan Chai). గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌చారం సంద‌ర్భంగా చెట్టు కింద‌, కారు లోపట సేద దీరుతూ టీ సేవించారు.

అప్ప‌ట్లో ఆయ‌న వాడిన టీ గ్లాసు కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగిన ఈ ప‌వ‌ర్ స్టార్ ఏది చేసినా అది వైర‌ల్ అవుతుంది.

తాజాగా ఇవాళ ప్ర‌పంచ టీ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాయ్(Pawan Kalyan Chai) దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. సామాన్యుల పానీయం చాయ్..అది వారికి త‌న‌కు ఓ ఆయుధం లాంటిద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వ్య‌క్తి కాదు ఓ అద్భుత‌మైన శ‌క్తి అన్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ మాటలు అక్ష‌ర స‌త్యాలు.

Also Read : చాయ్ కి మ‌హేష్ బాబు ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!