Kavya Maran CEO : కావ్య మార‌న్ ఆశ‌లు గ‌ల్లంతు

చేతులెత్తేసిన స‌న్ రైజర్స్ హైద‌రాబాద్

Kavya Maran CEO : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆఖ‌రి అంకానికి చేరింది. ఈనెల 29న ఫైన‌ల్ మ్యాచ్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు ఖ‌రార‌య్యాయి. ఊహించ‌ని రీతిలో కొత్త జ‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ షాక్ ఇచ్చాయి.

ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ క‌ష్ట‌ప‌డి ప్లే ఆఫ్స్ కు చేరుకోగా కీల‌క మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను దెబ్బ కొట్ట‌డంతో రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కు చేరింది.

ఇదంతా ప‌క్క‌న పెడితే భారీ ఎత్తున ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం. ఆ జ‌ట్టు సిఇఓ , అందాల ముద్దుగుమ్మ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిన కావ్య మార‌న్ (Kavya Maran CEO).

ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు మొద‌ట్లో విజ‌యాలు సాధించినా ఆ త‌ర్వాత వ‌రుస‌గా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో చేతులెత్తేసింది. ఆఖ‌రి మ్యాచ్ 

పంజాబ్ తో జ‌ర‌గ‌నుంది.

ఇక మ‌ధ్య‌లోనే ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న కేన్ విలియ‌మ్స‌న్ స్వ‌దేశానికి బ‌య‌లుదేరాడు. ఈ స‌మ‌యంలో ప్లే ఆఫ్స్ ముగియ‌డం, జ‌ట్టు

చేర‌క పోవ‌డంతో కోట్లు ఖ‌ర్చు పెట్టి తీసుకున్న జ‌ట్టు ఎందుకిలా అయ్యిందో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకుంది కావ్య మార‌న్(Kavya Maran CEO).

గ‌త ఏడాది దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 2021 ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ జ‌ట్టు కెప్టెన్ ను తొల‌గించింది.

కొత్త వ్య‌క్తిని నియ‌మించింది. కొత్త కెప్టెన్ ను మార్చినా జ‌ట్టు త‌ల రాత మార‌లేదు.

దీంతో ఏం చేయాల‌నే దానిపై కావ్య మార‌న్ ఫోక‌స్ పెట్టింది. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ అభిమానులు, కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఆరాధించే

కావ్య మార‌న్(Kavya Maran CEO) స్టేడియంలో క‌నిపించ‌క పోవ‌డంతో నిరాశ‌కు లోన‌వుతున్నారు.

ఆటే కాదు అందం కూడా ముఖ్య‌మేనంటున్నారు వారంతా.

Also Read : బ‌ట్ల‌ర్ ను ఊరిస్తున్న ఆరెంజ్ క్యాప్

Leave A Reply

Your Email Id will not be published!