RCB Celebretions : ముంబై విజ‌యం బెంగ‌ళూరు సంబురం

సెల‌బ్రేష‌న్స్ లో బిజీగా మారిన ఆట‌గాళ్లు

RCB Celebretions : ఇది ఊహించ‌ని ప‌రిణామం. ప్లే ఆఫ్స్ ఆశ‌లు అడుగంటిన ద‌శ‌లో ఉన్న‌ట్టుండి ఆడే ఛాన్స్ దొర‌క‌డంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB Celebretions)  టీమ్ కు ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి.

ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే క‌చ్చితంగా ముంబై ఢిల్లీ క్యాపిట‌ల్స్ మీద గెల‌వాలి. ఇక ఆర్సీబీ టీం, మేనేజ్ మెంట్ , అభిమానులు ముంబై ఇండియ‌న్స్ కు బహిరంగంగా మ‌ద్ద‌తు తెలిపారు.

దీంతో ఏక‌ప‌క్షంగా సాగుతుంద‌ని అనుకున్న మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ దాకా ఉత్కంఠ‌ను రేపింది. ఈ త‌రుణంలో ముంబై ఇండియ‌న్స్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

తాను ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌క పోయినా త‌న ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లేలా చేసింది. ఒక వేళ ఢిల్లీ గెలిచి ఉన్న‌ట్ల‌య‌తే నేరుగా ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లి ఉండేది.

శ‌నివారం రాత్రి తీవ్ర టెన్ష‌న్ కు తెర లేపిన మ్యాచ్ లో ముంబై గెలిచిన వెంట‌నే ఆ జ‌ట్టులో కంటే ఆర్సీబీ జ‌ట్టులో ఆనందాతిరేక‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఢిల్లీని ఇంటికి పంపించి త‌మ‌ను గ‌ట్టెక్కించిన రోహిత్ సేన‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అంటూ భార‌త స్టార్ ప్లేయ‌ర్, మాజీ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్ర‌స్తుతం ఆర్సీబీ సెలబ్రేష‌న్స్(RCB Celebretions)  ఫోటోలు , వీడియో సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తోంది.

అది వైర‌ల్ గా మారింది. డ్రెస్సింగ్ రూమ్ లో సంబురాలు అంబ‌రాన్ని తాకాయి. కోహ్లీ తో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు ముంబై తీసిన వికెట్లకు, కొట్టిన ఫోర్లు, సిక్స‌ర్ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

Also Read : త‌ళుక్కున మెరిసిన ముద్దుగుమ్మ IPL 2022

Leave A Reply

Your Email Id will not be published!