RR vs GT IPL 2022 : యుద్ధానికి సిద్ధం స‌మ‌రానికి స‌న్న‌ద్దం

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ గుజ‌రాత్ టైటాన్స్ ఫైట్

RR vs GT IPL 2022 : ఆఖ‌రి అంకం ముగిసింది ఐపీఎల్ 2022లో. ఇక చివ‌రి ద‌శ మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఐపీఎల్ మొద‌టి క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ కోల్ క‌తా వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , గుజ‌రాత్ టైటాన్స్(RR vs GT IPL 2022) జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇరు జ‌ట్లు అద్భుతంగా అనిపించినా మైదానంలోకి వ‌చ్చే స‌రిక‌ల్లా ఎవ‌రు ఎలా ఆడ‌తార‌నేది వేచి చూడాలి. ఇక అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్ము రేపుతోంది గుజ‌రాత్ టైటాన్స్ .

సాహా, గిల్ , వేడ్ , పాండ్యా, మిల్ల‌ర్ , రాహుల్ తెవాటితో బ్యాటింగ్ బ‌లంగా ఉంది. ఇక బౌలింగ్ విష‌యానికి వస్తే ష‌మీ, ర‌షీద్ ఖాన్ , ఫెర్గూసన్ కీల‌కంగా మార‌నున్నారు. ఇక ఈ జ‌ట్టు 14 మ్యాచ్ లు ఆడింది.

10 మ్యాచ్ ల‌లో గెలుపొంది 4 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. ఇక రాజ‌స్తాన్(RR vs GT IPL 2022) 14 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ ల‌లో గెలుపొంది 18 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది.

ఆర్ఆర్ టీమ్ ను చూస్తే అత్య‌ధిక ప‌రుగుల వీరుడు జోస్ బ‌ట్ల‌ర్, అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్ము రేపుతున్న ర‌విచంద్ర‌న్ అశ్విన్ , య‌శ‌స్వి జైస్వాల్ , దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ , సంజూ శాంస‌న్ బ్యాటింగ్ ప‌రంగా బ‌లంగా ఉన్నారు.

ఇక ఫినిష‌ర్ గా హిట్ మైర్ ఉండ‌నే ఉన్నాడు. రియాన్ ప‌రాగ్ స‌త్తా చాటితే ఆ జ‌ట్టు విజ‌యం ఖాయం. ఇక బౌలింగ్ లో చాహ‌ల్, అశ్విన్ తో పాటు కృష్ణ‌, మెక్ కాయ్ జోరు మీదున్నారు.

Also Read : ఐపీఎల్ లో సిక్స‌ర్ల మోత అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!