Mohammed Shami : జోస్ బ‌ట్ల‌ర్ కు అంత సీన్ లేదు

గేమ్ ప్లాన్ తో రెడీగా ఉన్నా

Mohammed Shami : ఐపీఎల్ 2022 ఆఖ‌రు ద‌శ‌కు చేరింది. 74 లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఇక టాప్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ రెండో ప్లేస్ లో ఉన్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో కీల‌క పోరు కొన‌సాగ‌నుంది.

ఫ‌స్ట్ క్వాలిఫ‌యిర్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక‌గా మ్యాచ్ కొన‌సాగుతుంది. 10 మ్యాచ్ లు గెలిచిన గుజ‌రాత్ ఫుల్ జోష్ లో ఉంది. ఎలాగైనా స‌రే అంతిమ విజ‌యం త‌మ‌దేనంటోంది ఆ జ‌ట్టు.

ఇక ఇరు జ‌ట్లు బ‌లంగానే ఉన్నాయి బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ. ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది. ఒక వేళ మ్యాచ్ ఓడి పోయినా రాజ‌స్తాన్ ఇంకో మ్యాచ్ ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది.

దీంతో ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఎవ‌రు రాణిస్తారు, ఎవ‌రు ఫోర్లు, సిక్స‌ర్ల మోత మోగిస్తారు. ఎవ‌రు వికెట్లు కూల్చుతారు, ఎవ‌రు రికార్డుల మోత మోగిస్తారంటూ ప్రిడిక్ష‌న్స్ (ముంద‌స్తు అంచ‌నా) వేస్తూ ఉన్నారు.

ఈ త‌రుణంలో ఇరు జ‌ట్లు త‌మ‌కు ఉన్న బ‌లాలు ఏంటో బ‌ల‌హీన‌త‌లు ఏంటో అనే దానిపై ఫోక‌స్ పెట్టాయి. ఎన్ని ప్లాన్స్ వేసినా చివ‌ర‌కు మైదానంలోకి వ‌చ్చే స‌రిక‌ల్లా మారి పోతాయి.

తాజాగా గుజ‌రాత్ ఆట‌కు చెందిన స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ(Mohammed Shami)  సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ పై. ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు బ‌ట్ల‌ర్.

జోస్ ను ఎలా అవుట్ చేయాలో త‌న‌కు తెలుస‌ని, త‌న ప్లాన్ త‌న‌కు ఉంద‌న్నాడు ష‌మీ.

Also Read : షేన్ వార్న్ కి చాహ‌ల్ నివాళి

Leave A Reply

Your Email Id will not be published!