Sanju Samson Pandya : ఆట ప‌దిలం స్నేహం శాశ్వ‌తం

మైదానంలో శాంస‌న్..పాండ్యా

Sanju Samson Pandya : ఔను వాళ్లిద్ద‌రూ అద్భుత‌మైన ఆట‌గాళ్లు. ఇద్ద‌రూ భార‌త క్రికెట్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఇద్ద‌రూ ఇబ్బందులు ఎదుర్కొని, క‌ష్టాల‌ను దాటుకుని కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టేంత దాకా ఎదిగారు.

వారెవ‌రో కాదు ఐపీఎల్ 2022లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన ఆ నాయ‌కుల‌లో ఒక‌రు కేర‌ళ సూప‌ర్ స్టార్ గా పేరొందిన సంజూ శాంస‌న్(Sanju Samson Pandya).

ఇంకొక‌రు నిన్న‌టి దాకా ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హించి, అనుకోని రీతిలో జ‌ట్టుకు దూర‌మై తిరిగి త‌న ప్ర‌తిభ‌తో గుజ‌రాత్ టైటాన్స్ ను విజ‌యాల బాట ప‌ట్టించిన నాయ‌కుడు హార్దిక్ పాండ్యా.

ఇక శాంస‌న్ మిస్ట‌ర్ కూల్ , పాండ్యా ప‌ర్ ఫెక్ట్ . మ‌రి ఈ ఇద్ద‌రూ త‌ల‌ప‌డితే ఎలా ఉంటుంది. చూడాల‌ని అనిపిస్తుంది. కొంద‌రు ఆట‌గాళ్లు రిజ‌ర్వ్ గా ఉంటారు. కానీ శాంస‌న్ ఎల్ల‌ప్పుడూ చాలా ప్ర‌శాంతంగా ఉంటాడు.

ఎక్క‌డా తొట్రుపాటుకు గుర‌వ‌డు. అందుకే శ్రీ‌లంక మాజీ క్రికెట్ దిగ్గ‌జం ప్ర‌స్తుత రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న కుమార సంగ‌క్క‌ర మాటల్లో అయితే శాంస‌న్ వెరీ వెరీ స్పెష‌ల్ ప్లేయ‌ర్.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం న‌మ్మ‌కాన్ని నిలబెట్టుకున్నాడు సంజూ. ఇక గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం ఈసారి కొత్త‌గా ఎంట్రీ ఇచ్చింది ఐపీఎల్ లో.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పూర్ ప‌ర్ ఫార్మెన్స్ తో పాటు గాయాల‌పాలై ఆట‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఆశిష్ నెహ్రా ఆ జ‌ట్టుకు హెడ్ కోచ్. ఇప్పుడు జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఐపీఎల్ లో ఎక్కువ‌గా క‌లిసి మాట్లాడుకునే వాళ్లల్లో శాంస‌న్ , పాండ్యా(Sanju Samson Pandya) ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు దిగిన ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : జ‌ట్టును ఒడ్డుకు చేర్చిన కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!