Deepak Hooda Eliminator : వారెవ్వా దీప‌క్ హూడా సూప‌ర్

వికెట్లు కూలినా ఆడిన క్రికెట‌ర్

Deepak Hooda Eliminator : ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. కానీ కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో మూల్యం చెల్లించుకుంది కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ .

టాస్ ఓడి ముందుగా బరిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపింది. ఆ జ‌ట్టుకు ల‌క్నో ప్లేయ‌ర్ల పేల‌వ‌మైన ఫీల్డింగ్ పుణ్య‌మా అంటూ భారీ స్కోర్ సాధించింది.

కీల‌క స‌మ‌యంలో చేతుల్లోకి వ‌చ్చిన క్యాచ్ ల‌ను వ‌దిలి వేశారు. దీంతో ఓట‌మి పాల‌య్యారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ , దీప‌క్ హూడా బంతుల్ని జార విడిచారు. దీంతో ఆర్సీబీ ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 20 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఇక 208 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి వ‌చ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప‌రుగులు చేసేందుకు త‌డ‌బ‌డింది. ఆర్సీబీ బౌల‌ర్లు పూర్తి స్తాయిలో క‌ట్ట‌డి చేశారు. ఈ త‌రుణంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 79 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు.

ఇక అత‌డికి తోడుగా యంగ్ స్టార్ దీపక్ హూడా(Deepak Hooda Eliminator) సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడి స‌త్తా చాటాడు. కానీ వీరిద్ద‌రూ త‌మ జ‌ట్టును క్వాలిఫ‌యిర్ -2కి చేర్చ లేక పోయారు. ఏది ఏమైనా ల‌క్నో ఆద్యంత‌మూ గెలిచేందుకు ప్ర‌య‌త్నం చేసింది.

రాహుల్, దీపక్ హూడా రెచ్చి పోయి ఆడారు. వీరిద్ద‌రూ మైదానంలో ఉన్నంత వ‌ర‌కు ఆర్సీబీ ఆశ‌లు వ‌దులుకుంది. కానీ 14 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ద‌ర్జాగా రాజ‌స్తాన్ తో ఆడేందుకు రెడీ అయ్యింది.

ఇక దీప‌క్ హూడా(Deepak Hooda Eliminator) ఎదుర్కొన్న‌ది త‌క్కువ బంతులే అయినా స్కోర్ ప‌రుగులు పెట్టించాడు. 26 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక ఫోర్ 4 సిక్స్ లు కొట్టాడు. 45 ర‌న్స్ చేశాడు.

Also Read : హూడా దెబ్బ‌కు పోలీస్ కు గాయం

Leave A Reply

Your Email Id will not be published!