India Tour West Indies : టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్

జూలై 22 నుంచి ఆగ‌స్టు 7 దాకా ప‌ర్య‌ట‌న

India Tour West Indies : తెంబా బ‌వుమా సార‌థ్యంలోని సౌతాఫ్రికా ఇండియాలో ప‌ర్య‌టించిన అనంత‌రం భార‌త జ‌ట్టు వెస్టిండీస్ లో ప‌ర్య‌టించేందుకు రెడీ అవుతోంది. ఈ మేర‌కు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది.

షెడ్యూల్ ఖ‌రారు చేసింది. భార‌త జ‌ట్టు(India Tour West Indies) వ‌చ్చే జూలై – ఆగ‌స్టు నెల్లో విండీస్ లో ప‌ర్య‌టించ‌నుంది. వ‌న్డే సీరీస్ తో పాటు

టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఈ సీరీస్ కు సంబంధించి భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య మొద‌టి వ‌న్డే మ్యాచ్ జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్ పార్క్ లో జ‌రుగుతుంది. రెండో వ‌న్డే 24న‌, మూడే

వ‌న్డే 27న ఇదే స్టేడియంలో భార‌త జ‌ట్టు విండీస్ తో ఆడుతుంది.

ఇక టీ20 సీరీస్ కు సంబంధించి తొలి టీ20 మ్యాచ్ జూలై 29న జ‌రుగుతుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని బ్రియ‌న్ లారా స్టేడియంలో కొన‌సాగుతుంది.

రెండో టీ20 మ్యాచ్ ఆగ‌స్టు 1న సెయింట్ కిట్స్ , నెవిస్ లోని వార్న‌ర్ పార్క్ లో జ‌రుగుతుంది. మూడో టీ20 మ్యాచ్ ఆగ‌స్టు 2న ఇదే స్టేడియంలో ఆడుతుంది.

ఇక నాలుగో టీ20 ఆగ‌స్టు 6న అమెరికా లోని ఫ్లోరిడా బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్ లో జ‌రుగుతుంది. ఇక ఐదో ట‌20 ఆగ‌స్టు 7న ఇదే మైదానంలో

కొన‌సాగుతుంది. జూన్ 9 నుంచి ద‌క్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడుతుంది.

ఈ సీరీస్ ముగియ‌గానే ఇంగ్లాండ్ తో ఆడ‌కుండా నిలిచి పోయిన 5వ టెస్టును ఆడేందుకు బ‌య‌లు దేరుతుంది. జూన్ 24 నుంచి జూలై 17

దాకా ఒక టెస్టు, మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. ఆ టూర్ పూర్త‌య్యాక నేరుగా విండీస్ కు బ‌య‌లు దేరుతుంది.

Also Read : మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు అంత సీన్ లేదు

Leave A Reply

Your Email Id will not be published!