Mithali Raj : ఆటకే వన్నె తెచ్చిన అందం
క్రికెట్ జర్నీలో మిథాలీ మెస్మరైజ్
Mithali Raj : ఆటలో అందం కూడా ప్రభావం చూపిస్తుంది. అందం చూడవయా ఆనందించవయా అని తెలుగు సినీ కవి అన్న మాటల్ని నిజం చేస్తూ వస్తున్నారు క్రీడాకారులు.
ప్రధానంగా టెన్నిస్ లో సూపర్ గా రాణిస్తూనే మరో వైపు తన అందంతో కట్టి పడేసిన టెన్నిస్ స్టార్ గా హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా ఉన్నారు.
ఆ తర్వాత గుత్తా జ్వాలా కూడా ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది మాత్రం హైదరాబాద్ కు చెందిన ఆల్ టైమ్ గ్రేట్ విమెన్ క్రికెటర్ గా అరుదైన రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్(Mithali Raj).
ఆమె తన అందంతో ఆకట్టుకుంది. ఆటకే వన్నె తీసుకు వచ్చేలా చేసింది. భారత క్రికెట్ లో పురుషులకే ఛాన్స్ , స్పేస్ ఉన్న సమయంలో రాకెట్ లాగా దూసుకు వచ్చింది మిథాలీ రాజ్.
ఒంటరి పోరాటం చేసింది. ఎవరి సహకారం లేక పోయినా తన అందమైన ఆట తీరుతో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టింది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ లలో 10,000లకు పైగా పరుగులు సాధించిన ఏకైక విమెన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.
మెల మెల్లగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూనే అంతర్జాతీయ స్థాయి పరంగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది మిథాలీ రాజ్.
ఒకప్పుడు క్రికెట్ ఆడేందుకు డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ ఈ క్రికెటర్ తన వైపు కార్పొరేట్ కంపెనీలు చూసేలా తనను తాను మల్చుకుంది.
చాలా కంపెనీలు ఆమెతో ఒప్పందం చేసుకున్నాయి. ఆట పరంగా ఎంతో సంపాదించినా తన మూలాలు మాత్రం మరిచి పోలేదు మిథాలీ రాజ్. ఏది ఏమైనా ఆటకే అందం వన్నె తెచ్చేలా చేసిన మిథాలీ(Mithali Raj) సెకండ్ కెరీర్ బాగుండాలని కోరుకుందాం.
Also Read : అవమానాల్ని భరించి విజేతగా నిలిచి
Why you are talking about beauty. Cant we see a sports woman as sports woman??