Nayanthara Vignesh Marriage : గ్రాండ్ గా నయన్ విఘ్నేశ్ పెళ్లి
హాజరైన తలవై, షారూఖ్ ఖాన్
Nayanthara Vignesh Marriage : కోలీవుడ్ ప్రేమికులుగా పేరొందిన ప్రముఖ నటులు నయనతార, విఘ్నేశ్ శివన్ ల పెళ్లి(Nayanthara Vignesh Marriage) గ్రాండ్ గా జరిగింది. గురువారం తెల్లవారజామున 2.22 గంటలకు వీరు ఒక్కటయ్యారు.
తమిళనాడు మహాబళిపురం లోని ఓ రిసార్ట్ లో కుటుంబీకులు, ఫ్రెండ్స్ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది వివాహం. అతిరథ మహారథులు, వివిధ రంగాలకు చెందిన వారితో పాటు సినీ రంగానికి చెందిన నటీ నటులు హాజరయ్యారు.
తలైవా రజనీ కాంత్ , బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ , డైరెక్టర్ అట్లీ , తదితరులు ఉన్నారు. తాజాగా నయనతార, శివన్(Nayanthara Vignesh Marriage) ల పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో.
కారులోంచి దిగి వస్తున్న రజనీకాంత్, న్యూ లుక్ తో ఎంట్రీ ఇచ్చిన బాద్ షా ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అట్లీ ఈ పెళ్లికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు.
ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో మూవీ తీసే పనిలో ఉన్నాడు. ఇక రజనీకాంత్ తో పాటు కోలీవుడ్ కు చెందిన సినీ నటులు అజిత్ , కార్తీ, ఇలయ తలపతి విజయ్ తో పాటు టాలీవుడ్ , శాండల్ వుడ్ కి చెందిన వారు కూడా హాజరయ్యారు.
అంతకు ముందు విఘ్నేష్ శివన్ ఆసక్తికరమైన పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా తనే షేర్ చేసిన పెళ్లి కూతురు డ్రెస్సు లో ఉన్న నయనతార ఫోటో సూపర్ గా ఉంది.
తన ఆనందాన్ని, ప్రేమను నయనతారకు అంకితం చేస్తున్నానంటూ పేర్కొనడం విశేషం. నయనతార అంతకు ముందు శింబుతో, ప్రభుతో ప్రేమలో పడింది. కానీ వర్కవుట్ కాలేదు. చివరకు విఘ్నేష్ శివన్ తో కుదిరింది.
Also Read : మిథాలీ రాజ్ ‘శభాష్ మిథు’ మెస్మరైజ్