Pooja Hegde : పూజా హెగ్డే కు క్షమాపణ చెప్పిన ఇండిగో
ఉద్యోగి ప్రవర్తన దారుణంగా ఉందంటూ ట్వీట్
Pooja Hegde : ప్రముఖ నటి పూజా హెగ్డే సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఘోరమైన అవమానం జరిగిందంటూ వాపోయింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఉద్యోగిపై సీరియస్ కామెంట్స్ చేసింది.
తనకు చేదు అనుభవం ఎదురైందంటూ గురువారం పూజా హెగ్డే(Pooja Hegde) తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ప్రస్తుతం నటి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్ లో ఇండిగో సిబ్బంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఉద్యోగి పేరు కూడా ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
విపుల్ నకాషే అనే ఉద్యోగి తనతో అహంకారంతో, అజ్ఞానంతో మాట్లాడారంటూ ఆరోపించింది. తన పట్ల ఎలాంటి కారణాలు లేకుండానే వేధించాడంటూ తెలిపింది.
సాధారణంగా ఇలాంటి వాటి పట్ల తాను పట్టించు కోనని , కానీ నటి అయిన తనకే ఇలాంటి ప్రవర్తన ఎదురైతే మిగతా ప్రయాణికుల పట్ల ఎలా వ్యవహరిస్తారో తలుచుకుంటే భయం వేస్తోందంటూ పేర్కొంది పూజా హెగ్డే(Pooja Hegde).
ఇవాళ తనతో అతడు ప్రవర్తించిన తీరు పద్దతి గా లేదని, అందుకే తాను సభ్య సమాజానికి తెలియాలనే ట్వీట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ముఖ్యంగా అతడి ప్రవర్తనను తాను భరంచ లేక పోయానని వాపోయింది.
చాలా భయం వేసిందని పూజా హెగ్డే తెలిపింది. నటి ట్వీట్ తో రంగంలోకి దిగింది ఇండిగో యాజమాన్యం. ఈ మేరకు స్పందించింది. సదరు హీరోయిన్ కు క్షమాపణలు చెప్పింది.
ఇలాంటి అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Also Read : గ్రాండ్ గా నయన్ విఘ్నేశ్ పెళ్లి
Extremely sad with how rude @IndiGo6E staff member, by the name of Vipul Nakashe behaved with us today on our flight out from Mumbai.Absolutely arrogant, ignorant and threatening tone used with us for no reason.Normally I don’t tweet abt these issues, but this was truly appalling
— Pooja Hegde (@hegdepooja) June 9, 2022