Ricky Ponting Kartik : కార్తిక్ పై రికీ పాంటింగ్ కామెంట్

దినేష్ కార్తీక్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు

Ricky Ponting Kartik : ఆస్ట్రేలియా మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting Kartik) షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌త జ‌ట్టు కు అత‌డు బ‌లమైన ఆట‌గాడిగా మారడం ఖాయ‌మ‌ని పేర్కొన్నాడు.

ఆ ఆట‌గాడు ఎవ‌రో కాదు దినేష్ కార్తీక్. ఈ వెట‌ర‌న్ ప్లేయ‌ర్ ను ఆకాశానికి ఎత్తేశాడు. మోస్ట్ డేంజ‌ర్ స్ గా మారాడ‌ని తెలిపాడు. ఐపీఎల్ లో అత‌డు క‌న‌బర్చిన ఆట తీరు త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌న్నాడు.

బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కార్తిక్ ను త‌ప్ప‌కుండా ఎంపిక చేయ‌డం ఖాయ‌మ‌న్నాడు. ప్ర‌తి జ‌ట్టుకు ఫినిష‌ర్ అవ‌స‌రం అవుతాడ‌ని ప్ర‌స్తుతం టీమిండియాకు ఆ కొర‌త తీరి పోయింద‌ని పేర్కొన్నాడు.

డెత్ సెష‌న్ లో బౌల‌ర్ల‌ను ఎదుర్కొని ప‌రుగులు తీయాలంటే చాలా నైపుణ్యంతో పాటు ద‌మ్ముండాల‌ని అది దినేష్ కార్తీక్(Ricky Ponting Kartik) కు ఉంద‌ని ప్ర‌శంసించాడు రికీ పాంటింగ్.

ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. అంత‌కు ముందు క్రికెట్ కామెంటేట‌ర్ గా ఉన్నాడు. త‌న కెరీర్ లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడాల‌ని, దానిని సాధించే జ‌ట్టులో తాను ఉండాల‌ని శ‌ప‌థం చేశాడు.

ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేశాడు. స‌క్సెస్ అయ్యాడు ఐపీఎల్ లో స‌త్తా చాటాడు. ఓడి పోయే మ్యాచ్ ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ పై విజ‌యం సాధించేలా కీల‌క పాత్ర పోషించాడు.

వ‌చ్చీ రావ‌డంతోనే దంచి కొట్ట‌డం ప్రారంభించాడు దినేశ్ కార్తీక్. ప్ర‌స్తుతం స్వ‌దేశంలో జ‌రుగుతున్న టి20 సీరీస్ కు భార‌త్ త‌ర‌పున ఎంపిక‌య్యాడు. మొత్తంగా ఈ స్టార్ ఫినిష‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.

Also Read : త‌ప్పుకున్న అమెజాన్ రిల‌య‌న్స్ కు చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!