Megastar Chiranjeevi : విక్ర‌మ్ టీమ్ కు చిరు అభినంద‌న

హాజ‌రైన స‌ల్మాన్..లోకేష్ క‌న‌క‌రాజ్

Megastar Chiranjeevi : లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విక్ర‌మ్ మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురుస్తోంది. కోట్లు కొల్ల‌గొడుతోంది.

ఎలాంటి ప్ర‌చారం లేకుండానే బ‌రిలోకి దిగిన ఈ మూవీ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. ఒక ర‌కంగా క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా పేర్కొన‌వ‌చ్చు.

ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌, క‌మ‌ల్ అద్భుత న‌ట జ‌నాన్ని క‌ట్టి ప‌డేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా విక్ర‌మ్ సినిమా ఏకంగా రూ. 250 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది. దీంతో సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయేలా చేసింది ఈ చిత్రం.

త‌న కెరీర్ లో ఇలాంటి గొప్ప సినిమా అందించినందుకు సంతోషంతో ఏకంగా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు ద‌ర్శ‌కుడికి న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.

కాగా విక్ర‌మ్ మూవీ అంచ‌నాలు మించి విజ‌యం సాధించినందుకు త‌న మిత్రుడు క‌మ‌ల్ హాస‌న్ ను , ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ , బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ ను ప్ర‌త్యేకంగా విందుకు ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) .

ఆ ముగ్గురిని సాద‌రంగా ఆహ్వానించి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు.

అంతే కాకుండా త‌న చిర‌కాల మిత్రుడు క‌మ‌ల్ హాస‌న్ స‌క్సెస్ త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలిపాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు చిరంజీవి.

విక్ర‌మ్ మూవీ అద్భుతంగా, థ్రిల్లింగ్ గా ఉంద‌న్నాడు. ఈ మూవీలో విజ‌య్ సేతుప‌తి, ఫాజిల్ న‌టించారు.

Also Read : సోనాలీ ‘ది బ్రోకెన్ న్యూస్’ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!