Amber Heard : జానీ డెప్ అద్భుతమైన నటుడు – అంబర్
మాజీ భార్య సంచలన కామెంట్స్
Amber Heard : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన హాలీవుడ్ నటుల పరువు నష్టం కేసు ఎట్టకేలకు ముగిసింది. కానీ ఊహించని రీతిలో జానీ డెప్ మాజీ భార్య ప్రముఖ నటి అంబర్ హియర్డ్(Amber Heard) కు కోలుకోలేని షాక్ తగిలింది.
ఏడుగురు సభ్యులతో కూడిన వర్జీనియా జ్యూరీ తప్పు అంబర్ దేనంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు $15 వేల మిలియన్ల డాలర్లు నష్ట పరిహారం కింద జానీ డెప్ కు చెల్లించాలంటూ సంచలన తీర్పు చెప్పంది.
కేసు విచారణ అనంతరం మొదటిసారిగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది అంబర్ హియర్డ్. జానీ డెప్ తెర పైనే కాదు నిజ జీవితంలో గొప్ప నటుడంటూ సంచలన కామెంట్స్ చేసింది.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. యుఎస్ లోని వర్జీనియాలో గత ఏప్రిల్ 11న ఈ పరువు నష్టం కేసు ప్రారంభమైంది. ఆరు వారాల పాటు కొనసాగింది.
జానీ డెప్ తరపున లాయర్ కెమిల్లె అద్భుతంగా వాదించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉండగా మొదటిసారిగా నోరు విప్పారు అంబర్ హియర్డ్(Amber Heard).
వర్జీనియా జ్యూరీ జానీ డెప్ కు ఎందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారో తనకు ఇప్పుడు అర్థమైందన్నారు. తాను వారిని నిందించ దల్చు కోలేదన్నారు. నేను అర్థం చేసుకున్నాను.
నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే జానీ డెప్ అద్భుతమైన నటుడని అని చెప్పింది. తనకు అన్యాయం మాత్రం జరిగిందని తాను చెప్పగలనని అన్నారు హియర్డ్.
సోషల్ మీడియా ఈ కేసుపై తీవ్ర ప్రభావం చూపిందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
Also Read : జానీ డెప్ తో డేటింగ్ అబద్దం – కామిల్లె