Telugu Indian Idol : తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత వాగ్దేవి

క‌ప్ తో పాటు బ‌హుమ‌తి అంద‌జేసిన చిరంజీవి

Telugu Indian Idol : ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆహా నిర్వ‌హించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ఫినాలే ఎపిసోడ్ ఆనందోత్సాహాల మ‌ధ్య ముగిసింది. ఫైన‌ల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

పాల్గొన్న వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. త‌న గానంతో అంద‌రినీ మైమ‌రిపించేలా చేసింది వాగ్ధేవి. కంటెస్టెంట్స్ చేసిన సంద‌డి ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. చిరంజీవితో పాటు న‌టీ న‌టులు ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి పాల్గొన్నారు.

ఈ షోలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఈ షోకు సింగ‌ర్ శ్రీ‌రామ‌చంద్ర హోస్ట్ గా నిర్వ‌హించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. థ‌మ‌న్ , న‌టి నిత్యా మీన‌న్ , సింగ‌ర్ కార్తీక్ న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ ఫినాలే ఎపిసోడ్ లో వాగ్దేవి, వైష్ణ‌వి, ప్ర‌ణ‌తి, జ‌యంత్ , శ్రీ‌నివాస్ ఫైన‌ల్ కు చేరారు. వీరిలో చివ‌ర‌గా వాగ్దేవి విజేత‌గా నిలిచింది. శ్రీ‌నివాస్ రెండో స్థానంలో నిలువ‌గా వైష్ణ‌వి మూడో స్థానం ద‌క్కించుకుంది.

ఇక విజేత‌గా నిలిచిన వాగ్దేవికి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్(Telugu Indian Idol) ఫినాలే క‌ప్ తో పాటు రూ. 10 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ అందుకుంది. ఈ సంద‌ర్బంగా గీతా ఆర్ట్స్ నుండి రాబోయే సినిమాలో పాట పాడే చాన్స్ ద‌క్కించుకుంది వాగ్దేవి.

మ‌రో వైపు ఊహించ‌ని రీతిలో వాగ్దేవి సోద‌రి వైష్ణ‌వికి అవకాశం ద‌క్కింది. తాను న‌టించే గాడ్ ఫాద‌ర్ మూవీలో వైష్ణ‌వికి పాట పాడే చాన్స్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మెగాస్టార్.

ఇదిలా ఉండ‌గా సింగ‌ర్ కార్తీక్ తాను సంగీతం అందించే సినిమాలో వాగ్దేవికి పాడే చాన్స్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : మ‌న‌సు దోచేస్తున్న ‘777 చార్లి’ మూవీ

Leave A Reply

Your Email Id will not be published!