IND vs SA 5th T20 : ఆఖ‌రి స‌మ‌రంలో విజేత ఎవ‌రో

భార‌త్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా బిగ్ ఫైట్

IND vs SA 5th T20 : ఐదు మ్యాచ్ ల టి20 సీరీస్ లో ఆఖ‌రి మ్యాచ్ కు వేదిక కానుంది బెంగ‌ళూరు. భార‌త్ vs ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల(IND vs SA 5th T20) మ‌ధ్య కీల‌కమైన ఐదో మ్యాచ్ ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలుపొందాయి.

ఈ చివరి మ్యాచ్ లో ఎవరు గెలుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తుందో ఆ జ‌ట్టునే సీరీస్ వ‌రిస్తుంది. మొద‌టి , రెండో గేమ్

ల‌ను ప‌ర్యాట‌క స‌ఫారీ జ‌ట్టు స‌క్సెస్ సాధిస్తే మిగ‌తా మూడు, నాల్గో టి20 మ్యాచ్ ల‌ను టీమిండియా కైవ‌సం చేసుకుంది.

దీంతో బెంగ‌ళూరు చిన్న‌స్వామి మైదానం ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. భార‌త జ‌ట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు

బౌలింగ్ లోనూ రాణించింది.

ఇషాన్ కిష‌న్ , హార్దిక్ పాంండ్యాతో పాటు ఫినిష‌ర్ దినేష్ కార్తీక్ సూప‌ర్ ఫామ్ లో కొన‌సాగుతున్నారు. ఇక యుజ్వేంద్ర చాహ‌ల్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్, భువనేశ్వ‌ర్ కుమార్, అవేష్ ఖాన్ సూప‌ర్ ఫామ్ క‌న‌బ‌రుస్తున్నారు.

కానీ భార‌త జ‌ట్టును వేధిస్తున్న స‌మ‌స్య జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ పూర్ ప‌ర్ ఫార్మెన్స్ నిరాశ‌కు గురి చేస్తోంది. ఇక స‌ఫారీ జ‌ట్టును చూస్తే

క్వింట‌న్ డికాక్ , కిల్ల‌ర్ డేవిడ్ మిల్ల‌ర్, వారెన్ డ‌స్సెన్ ఏ మాత్రం కుదురుకున్నా టీమిండియాకు చుక్క‌లు చూపించ‌డం ఖాయం.

ఇక తుది జ‌ట్ల ప‌రంగా చూస్తే భార‌త జ‌ట్టు(IND vs SA 5th T20) లో పంత్ కెప్టెన్ కాగా ఇషాన్ , రుతురాజ్ , హార్దిక్ , కార్తీక్ , హ‌ర్ష‌ల్, భువనేశ్వ‌ర్,

అవేష్, యుజ్వేంద్ర చాహ‌ల్ ఆడ‌తారు.

ఇక ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ప‌రంగా చూస్తే బ‌వూమా కెప్టెన్ కాగా హెన్ డ్రిక్స్ , డికాక్ , ప్రిటోరియ‌స్ , డ‌సెన్ , క్లాసెన్ , మిల్ల‌ర్, జాన్స‌న్ , ర‌బ‌డ‌, నోర్జే,

ఇంగిడి, ష‌మ్సీ ఉన్నారు.

Also Read : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుపై గంగూలీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!