Sravana Bhargavi Hemachandra : అవ‌న్నీ రూమ‌ర్లు కాసులు ఫుల్

హేమ‌చంద్ర‌..శ్రావ‌ణ భార్గ‌వి కామెంట్

Sravana Bhargavi Hemachandra : వాళ్లిద్ద‌రూ మంచి గాయ‌నీ గాయ‌కులు. ఆక‌ట్టుకునే రూప‌మే కాదు గుండెల్ని మీటే గొంతులు వాళ్ల‌వి. పేరొందిన పాట‌లు పాడారు. పాట‌ల జ‌ర్నీలోనే ఇద్ద‌రూ ఒక్క‌టయ్యారు.

వారెవరో కాదు హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి(Sravana Bhargavi Hemachandra). ఆమె గాయ‌ని మాత్ర‌మే కాదు మంచి డ‌బ్బింగ్ కూడా చెప్ప‌డంలో ఫేమ‌స్. గ‌త కొంత కాలం నుంచి వీరిద్ద‌రిపై రూమ‌ర్లు పెరిగాయి.

త్వ‌ర‌లోనే విడి పోతున్నారంటూ ప్ర‌చారం భారీగా జ‌రిగింది. ప్రచుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో నిత్యం వీరి గురించిన వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కొందిరికే తెలిసిన ఈ జంట ఇప్పుడు మ‌రింత పాపుల‌ర్ గా మారింది.

అయితే టాలీవుడ్ లో మ‌రో జంట విడి పోతున్నారంటూ ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. ఇప్ప‌టికే నాగ చైత‌న్య‌, స‌మంత విడి పోయాక మీడియా హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి జంట‌పై ఫోక‌స్ పెట్టింది.

ఇంకేం రేపో మాపో అంటూ ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో గాయ‌నీ గాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్ప‌టికీ నోరు విప్పారు. సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

తామిద్ద‌రం విడి పోలేద‌ని, మీ అంద‌రి ప్ర‌చారం వ‌ల్ల త‌మ‌కు ఎన‌లేని ఆదాయం పెరిగింద‌ని చెప్పుకొచ్చారు. గ‌తంలో అంత‌గా లేని వ్యూస్ ఈ పుకార్ల దెబ్బ‌కు అమాంతం చూసే వారి సంఖ్య పెరుగుతూ పోతోందట‌.

సో ఈ ప్ర‌చారం అబ‌ద్ద‌మైనా ఈ గాయ‌నీ గాయ‌కుడి జంటకు మాత్రం ఆదాయం భారీగానే వ‌స్తోంద‌ని శ్రావ‌ణ భార్గ‌వి తెలిపింది. సో ఒక ర‌కంగా నెగ‌టివ్ ప్ర‌చార‌మే అయినా త‌మ‌కు మాత్రం చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొంది.

Also Read : సూర్య‌..కాజోల్ కు అరుదైన అవ‌కాశం

Leave A Reply

Your Email Id will not be published!