INDW vs SLW 1st ODI : టీమిండియా టార్గెట్ 172 రన్స్
రాణించిన నీలాక్షి డిసిల్వా
INDW vs SLW 1st ODI : భారత శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో శ్రీలంక 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే టి20 సీరీస్ ను భారత మహిళా(INDW vs SLW 1st ODI) జట్టు కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ లకు గాను 2-1తో సత్తా చాటింది.
ఇక మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా శుక్రవారం పల్లెకెలె స్టేడియంలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 171 పరుగులు చేసింది.
శ్రీలంక టీమ్ తరపున నీలాక్షి డిసిల్వా 43 పరుగులతో రాణించింది. టాప్ స్కోరర్ గా నిలిచింది. రేణుకా సింగ్ , దీప్తి శర్మలు ఆరంభంలోనే రెండు శ్రీలంక వికెట్లను తీశారు.
వెనువెంటనే భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చెలరేగడంతో ఎలంక 23 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. ముందు శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇదిలా ఉండగా హర్మన్ ప్రీత్ కౌర్ తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. ఇక 50 ఓవర్ల మ్యాచ్ లో శ్రీలంక 48.2 ఓవర్లలో ఆలౌటైంది. హాసిని పెరీరా 37 రన్స్ చేస్తే , హర్షిత మాధవి 28 రన్స్ , అనుష్క సంజీవిని 18 పరుగులు చేశారు.
ఇనోక రణవీర 12 రన్స్ చేసింది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే భారత బౌలర్లలో రేణుక శర్మ , దీప్తి శర్మ 3 వికెట్ల చొప్పున తీశారు. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో వికెట్ పడగొట్టారు. పూజా వస్త్రాకర్ 2 వికెట్లు తీసి సత్తా చాటింది.
Also Read : ఉత్కంఠ పోరుకు భారత్ ఇంగ్లండ్ రెడీ