APPSC Group 1: APPSC గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల !

APPSC గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల !

APPSC Group 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి గాను జనవరి 28 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మార్చి 17న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

APPSC Group 1 Updates

రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌ 1; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ అధికారులు హాల్ టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read : YS Sharmila: ‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు – వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!