Atal Bihari Vajpayee : అరుదైన‌ నేత అట‌ల్ జీ

అజాత శ‌త్రువు వాజ్ పేయి

Atal Bihari Vajpayee : భార‌త దేశ రాజ‌కీయాల‌లో అరుదైన నాయ‌కుడు అట‌ల్ బిహారి వాజ్ పేయి. దేశానికి 11వ ప్ర‌ధాన మంత్రి గా ఉన్నారు. ఒక్క ఓటు తేడాతో ప్ర‌భుత్వాన్ని కోల్పోయిన చ‌రిత్ర కూడా ఆయ‌న‌ది. రెండోసారి 14వ పీఎంగా ప‌ని చేశారు వాజ్ పేయి. డిసెంబ‌ర్ 25, 1924లో పుట్టారు. ఆగ‌స్టు 16, 2018లో లోకాన్ని వీడారు. క‌వి, ర‌చ‌యిత‌, వ‌క్త‌, నాయ‌కుడిగా పేరు పొందారు అట‌ల్ జీ(Atal Bihari Vajpayee). ఆజ‌న్మాంతం బ్ర‌హ్మ‌చారిగా ఉన్నారు. ప‌లుమార్లు ఎంపీగా గెలుపొందారు. రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 1968 నుండి 1973 దాకా జ‌న్ సంఘ్ కు చీఫ్ గా ప‌ని చేశారు. 1996లో పీఎం యోగం ద‌క్కినా కేవ‌లం 13 రోజులే ఉన్నారు. 1998లో తిరిగి ప్ర‌ధానిగా గెలుపొంది 13 నెల‌ల పాటు పాలించారు. 1994లో ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ పుర‌స్కారం ద‌క్కింది. ఇక తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వం మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌ను చేప‌ట్టారు. ఆయ‌న దేశానికి చేసిన విశిష్ట సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం భార‌త ర‌త్న‌తో గౌర‌వించింది.

Atal Bihari Vajpayee Good Things

అనారోగ్యంతో మంచం మీద ఉన్న వాజ్ పేయి నివాసానికి స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తి వెళ్లి పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ప‌లు భాష‌ల‌లో ప‌ట్టుంది. 1939లో ఆర్ఎస్ఎస్ లో చేరాడు. దీన్ ద‌యాళ్ న‌డుపుతున్న పత్రిక‌ల‌లో ప‌ని చేశాడు. క్విట్ ఇండియాలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. శ్యాం ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి స‌హాయ‌కుడిగా ఉన్నాడు వాజ్ పేయి. 1957లో అటల్ జీ(Atal Bihari Vajpayee) బ‌ల్రామ్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎంపీగా ఎన్నిక‌య్యాడు. వాగ్ధాటితో జ‌న్ సంఘ్ లో , బీజేపీలో టాప్ లీడ‌ర్ గా ఎదిగాడు. 1980లో బీజేపీ ఏర్ప‌డింది.

ఆనాటి ఇందిరా గాంధీ స‌ర్కార్ ను ప‌దునైన మాట‌ల‌తో విమ‌ర్శిస్తూ వెలుగులోకి వ‌చ్చాడు. రామ మందిర నిర్మాణం కోసం పిలుపునిచ్చింది ఆయ‌న హ‌యాంలోనే. 1995లో ముంబై వేదిక‌గా భార‌త ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా అటల్ జీని ప్ర‌క‌టించారు ఎల్ కే అద్వానీ. పోఖ్రాన్ ప‌రీక్ష‌లు జ‌రిపింది కూడా ఆయ‌న హ‌యాంలోనే కావ‌డం విశేషం. పాకిస్తాన్ కు బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించారు అట‌ల్ జీ. కార్గిల్ యుద్దం లో భార‌త్ జ‌య కేత‌నం ఎగుర వేసింది. మూడో ద‌ఫా కాలంలో కీల‌క మైన మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆర్థిక‌, మౌలిక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు.

ప్రైవేట్ రంగాన్ని, విదేశీ పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించాడు. నేష‌న‌ల్ హైవే డెవ‌ల‌ప్ మెంట్ ప్రాజెక్టు, పీఎం స‌డ‌క్ యోజ‌న ను ప్ర‌వేశ పెట్టింది ఆయ‌నే. 2000లో 22 ఏళ్ల త‌ర్వాత అమెరికా చీఫ్ క్లింట‌న్ సంద‌ర్శించారు. ర‌ష్యా చీఫ్ పుతిన్ తో ముచ్చ‌టించారు. బంగారు ల‌క్ష్మ‌న్ ముడుపుల వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఇదే స‌మ‌యంలో 2001లో అట‌ల్ జీ హ‌యాంలోనే స‌ర్వ శిక్షా అభియాన్ కు శ్రీ‌కారం చుట్టారు. దాడులు పెర‌గ‌డంతో ముస్లింలు అధికంగా ఉన్న చోట వారు శాంతియుతంగా ఉండేందుకు ఇష్ట ప‌డ‌రంటూ కామెంట్ చేశారు.

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అప్ప‌టి రాష్ట్రప‌తి కేఆర్ నారాయ‌ణ‌న్ సైతం బీజేపీ స‌ర్కార్ ప‌ట్ల సీరియ‌స్ కామెంట్స్ చేశారు.2005లో క్రియాశీల‌క రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. వాజ్ పేయిని రాజ‌కీయ భీష్ముడు అని కొనియాడారు మాజీ పీఎం మ‌న్మోహ‌న్ సింగ్. న‌మిత అనే అమ్మాయిని ద‌త్త‌త తీసుకున్నాడు. సంగీతం, నాట్యం, ప్ర‌కృతి అంటే ఇష్టం వాజ్ పేయికి. నెహ్రూ సైతం అట‌ల్ జీ మాట్లాడేట‌ప్పుడు శ్ర‌ద్ద‌గా ఆల‌కించేవాడు. ఏది ఏమైనా అట‌ల్ జీ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని అధ్యాయం.

Also Read : RS Praveen Kumar : హ్యాట్సాఫ్ భాను ప్ర‌సాద్ – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!