Vangaveeti Radha : వంగవీటి రాధా పెళ్లి ఫిక్స్

న‌ర్సాపురంకు చెందిన అమ్మాయి

Vangaveeti Radha : ఏపీలో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా పేరు పొందారు వంగ‌వీటి రాధా కృష్ణ‌. ఆయ‌న తండ్రి దివంగ‌త వంగ‌వీటి మోహ‌న రంగా. రాజ‌కీయాల‌లో ముఖ్య‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. కొంత కాలం నుంచీ పెళ్లికి దూరంగా ఉన్నారు. పాలిటిక్స్ కార‌ణంగా బిజీగా ఉండ‌డంతో స‌మ‌యం కేటాయించ లేనేమోన‌ని ఆలోచించారు.

Vangaveeti Radha Marriage Fixed

కానీ వంగవీటి రాధా కృష్ణ కుటుంబానికి ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న తండ్రిని దారుణంగా చంపారు. ఆ త‌ర్వాత రాధాకృష్ణ త‌న‌ను తాను లీడ‌ర్ గా ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స్వ‌యంగా వంగవీటి రాధా కృష్ణ(Vangaveeti Radha) ప్ర‌క‌టించారు. దీంతో ఏపీలో ఆయ‌న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

త‌మ నేత ఎట్ట‌కేల‌కు పెళ్లి కొడుకు కాబోతున్నాడ‌ని సంబురాలలో మునిగి పోయారు. న‌ర్సాపురం ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తితో రాధా కృష్ణ తో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు టాక్. త‌న స్నేహితుడికి ద‌గ్గ‌రి బంధువుల అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయిన‌ట్లు కుటుంబీకులు తెలిపారు.
న‌ర్సాపురం కు చెందిన జ‌క్కం పుష్ప‌వ‌ల్లితో రాధాకృష్ణ‌కు పెళ్లి కుదిరింది. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ జ‌క్కం అమ్మాని, బాబ్జీల చిన్న కూతురే ఈమె. ఈనెల 19న ముహూర్తం ఖ‌రారు చేశారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో కొన‌సాగుతున్నారు.

Also Read : Atal Bihari Vajpayee : అరుదైన‌ నేత అట‌ల్ జీ

Leave A Reply

Your Email Id will not be published!