Chipko Movement: చిప్కో ఉద్యమనేత మురారి లాల్‌ మృతి !

చిప్కో ఉద్యమనేత మురారి లాల్‌ మృతి !

Chipko Movement: సామాజిక కార్యకర్త, చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్‌ (91) శుక్రవారం తుది శ్వాస విడిచారు. రుషికేశ్‌(Rishikesh) లోని ఎయిమ్స్‌లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతిచెందారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌ కు లాల్‌ అధ్యక్షునిగా పనిచేసారు. ఆయన తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. లాల్‌ మృతి పట్ల పర్యావరణ వేత్త చండీ ప్రసాద్‌ భట్‌ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు గుర్తించి గౌరవించాయి.

Chipko Movement Viral

చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణ ఉద్యమం. 1973లో చమోలి జిల్లా (ఉత్తరాఖండ్) లోని గోపేశ్వర్‌ లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ (అప్పట్లో ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో భాగం) సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరూ ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకొని చెట్లను నరకాలనుకుంటే వాటితోపాటు మమ్మల్నీ నరకండి అని హెచ్చరించారు. దీనితో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే గిరిజనులు (ముఖ్యంగా బిష్ణోయ్ తెగ మహిళలు) ఆ ప్రాంతంలోని అడవులను (నరికివేయకుండా) కాపాడుకోవడానికి చేపట్టారు. తొలుత వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు.

Also Read : MLC Kavitha: 15 వరకు సీబీఐ కస్టడీలో కవిత !

Leave A Reply

Your Email Id will not be published!