హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు నామినేషన్ తిరస్కరణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఆ నమ్మక ద్రోహానికి పాల్పడింది ఎవరనే దానిపై బాంబు పేల్చారు గతంలో కేసు నమోదు చేసిన శ్రీలత అనే మహిళ. తను ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక ంశాలు వెల్లడించారు. జూన్ 6వ తేదీన నేను కోర్టుకు వెళ్ళిన సమయంలో ఒక కాంగ్రెస్ నాయకుడి పీఏ (PA) నా వద్దకు వచ్చి మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన కేస్ ఫైల్ కావాలని అడిగారు. ఆ వ్యక్తి కోర్టుకు ఎందుకు వచ్చారో, ఆ ఫైల్ ఎందుకు అడిగారో నాకు తెలియదు. దీనిపై విచారణ జరపాలంటే కోర్టు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అతనెవరో తెలిసి పోతుందని అన్నారు.
నేను కేసు నిమిత్తం కోర్టు సెక్షన్ ఆఫీసులో ఉన్నప్పుడు నా కేస్ ఫైల్ టేబుల్ మీద ఉండగా ఎవరూ లేని సమయంలో అది బయటకు వచ్చిందని బాంబు పేల్చారు శ్రీలత. నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన బాధితురాలు శ్రీలత. తన పై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని ఆరోపించారు. అందుకే ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌పై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపిన శ్రీలత అనే బాధితురాలు.
రాజ్యసభకు సంబంధించిన నామినేషన్ పత్రాల్లో ఈ కేసు అంశాన్ని మీనాక్షి నటరాజన్ పేర్కొనలేదని, అందువల్లనే ఆమె నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి. దీంతో 64 సభ్యులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ తన సీటును కోల్పోయింది. .
