కూట‌మి పాల‌న‌లో జెట్ స్పీడ్ లో అభివృద్ది

కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది

అమ‌రావ‌తి : కూట‌మి పాల‌న‌లో అభివృద్ది జెట్ స్పీడ్ లో కొన‌సాగుతోంద‌ని చెప్పారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి. పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి విస్తృతంగా పర్యటించారు. కోటఉరట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగునా హారతులతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రపురం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కోటఉరట్ల మండలం సుంకుపూరు గ్రామంలో గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. తనను రెండోసారి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేసినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయని, గత ప్రభుత్వంలో అభివృద్ధి నిలిచి పోయిందని విమర్శించారు. రామచంద్రపురం గ్రామంలో రూ.1.16 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.2 014-19 కాలంలో ప్రారంభమైన పందూర్ బ్రిడ్జి పనులను ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తి చేసినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.40 కోట్లు, ఆర్ & బీ ద్వారా మరో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. కోటఉరట్ల మండలంలో కూడా పరిశ్రమలను తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!